
చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి
రొంపిచెర్ల: సూపర్ సిక్స్ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం చిచ్చిలివారిపల్లె, పెద్దమల్లెల గ్రామాల్లో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సూపర్ సిక్స్ పథకాల వల్ల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి కలుగుతోందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. గతంలో వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేశారని గుర్తు చేశారు. మహిళలకు పెద్ద పీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డీశ్వర్‌రెడ్డి, కరీముల్లా, విజయశేఖర్, రవీంద్ర, చంద్రారెడ్డి, నీరజాక్షులు నాయుడు, ప్రేమానందం, వెంకటరత్నం, సిద్ధరామిరెడ్డి, కమలాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.