
ప్రణాళికాబద్ధంగా చదవాలి
● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని రణదీవెనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఓ ప్రైవేట్ పాఠశాల సౌజన్యంతో బెల్టులు, ఐడెంటిటీ కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ హాజరై మాట్లాడారు. కష్టపడి చదివితే విజయం సొంతమవుతుందన్నా రు. అలాగే ఆరోగ్యంపై దృష్టి సారించాలనానరు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ పార్కు అందుబాటులోకి తీసుకురావాలి
జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలోని సైన్స్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని ట్రె యినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవా రం సైన్స్ పార్కును పరిశీలించారు. పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. సై న్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం భవిత రిసోర్స్ సెంటర్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డైట్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, జిల్లా సైన్స్ అధి కారి భాస్కర్, కిరణ్, పుష్పవేణి, తదితరులున్నారు.