
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా బేస్‌బాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఇంది రా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి బేస్‌బాల్ ఎంపిక పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వీరికి బుధవారం నుంచి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఐపీ స్టేడియంలోనే ఈనెల 16నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి, అజయ్, గౌతమ్, నాగరాణి పాల్గొన్నారు.