
ఐటీడీఏ అక్రమాలపై విచారణ జరిపించాలి
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో పాటు ఎస్టీ రి జర్వేషన్ ఉల్లంఘనలపై జాతీయ ఎస్టీ కమిషనర్ హుస్సేన్‌నాయక్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ట్లు ఏజెన్సీడీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా సభ్యుడు జాదవ్ సుమేష్ తెలి పారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి వందశాతం ఎస్టీ రి జర్వేషన్ అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించి అన్ని హక్కులు గిరిజనులకే క ల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆయన వెంట దేవురావ్, కుమార్ పాల్గొన్నారు.