డీసీసీ ఇప్పట్లో లేనట్టే..! | - | Sakshi
Sakshi News home page

డీసీసీ ఇప్పట్లో లేనట్టే..!

Aug 13 2025 5:02 AM | Updated on Aug 13 2025 5:02 AM

డీసీసీ ఇప్పట్లో లేనట్టే..!

డీసీసీ ఇప్పట్లో లేనట్టే..!

● జిల్లా అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యం ● అన్నిరకాల కమిటీలు కూడా.. ● ‘స్థానిక’ ఎన్నికల తర్వాతేననే ప్రచారం ● ‘హస్తం’ శ్రేణుల్లో నిరాశ

సాక్షి,ఆదిలాబాద్‌: ‘త్వరలో పార్టీ పదవుల కేటా యింపు ఉంటుంది.. జెండా మోసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.. బూత్‌ స్థాయి నుంచి అన్నిరకాల కమిటీల బలోపేతానికి చర్యలు తీ సుకుంటాం.. వాటికి పునర్‌ వైభవం తీసుకురావడమే మా ముందున్న లక్ష్యం.. జిల్లా అధ్యక్షుడిని ని యమిస్తాం..’ఇది కాంగ్రెస్‌పార్టీ పరిశీలకులు, ఉమ్మ డి జిల్లా ఇన్‌చార్జీలు పార్టీ సమావేశాల్లో కార్యకర్తలను ఉద్దేశించి అన్న మాటలు. దీంతో ఇక పార్టీకి మంచి రోజులు రానున్నాయన్న సంతోషం కార్యకర్తల్లో కనిపించింది. మళ్లీ ఏమైందో ఏమో గానీ ఈ విషయంలో స్తబ్ధత నెలకొంది. జిల్లా అధ్యక్షుడి ని యామకం ఇప్పట్లో లేనట్టేననే సంకేతాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంపై కూడా స్పష్టత లేదు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఏప్రిల్‌, మే నెలల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి వివిధ కమిటీల నియామకం కోసం మండల, పట్టణ సమావేశాలను విస్తతంగా నిర్వహించారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆయా కమిటీలకు గాను ఒక్కో దానికి ఐదేసి పేర్ల చొప్పున దరఖాస్తులు కూడా స్వీకరించారు. శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.ఇక పార్టీకి సంబంధించి గ్రామ, మండల, వార్డు, పట్టణ,బ్లాక్‌ కమిటీలను పూర్తి చేస్తా రని భావించారు. అయితే అధిష్టానం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు,డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఆసక్తి చూపడం లేదని పార్టీలో ప్రచారం సాగుతుంది.

ఇలా అయితే ఎలా..

రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడం, జిల్లాకు దిక్సూచిగా ఉండాల్సిన అధ్యక్షుడి పదవి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ఖాళీగా ఉండటంపై కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు సాగుతుండడంతో కొంతైనా ప్రభుత్వ పథకాలపై ప్రచారం జరుగుతుందనే అభిప్రా యం ఉంది. అయితే అన్ని స్థాయిల్లో కమిటీల నియామకం జరిగితేనే పార్టీ బలపడుతుందని, అలాగే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే అధిష్టానం ఈ విషయంలో వెనుకడుగు వేయడం గమనార్హం.

గ్రూపు తగాదాల నేపథ్యంలోనే..

పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలోనే అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకంలో మళ్లీ వెనుకంజ వేస్తుందన్న ప్రచారం సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో నాయకుల మధ్య గ్రూపు తగాదాలు ఉండడంతో ఈ పరిస్థితి ఉందని అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమిటీలు నియమించి, జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేస్తే గ్రూపు తగాదాలు మరింత పెరుగుతాయా అనే సందేహం అధిష్టానంలో ఉందని, దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయానికి ముందడుగు పడడం లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే మిగతా జిల్లాల్లో గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉండడంతో కనీసం మాజీ జిల్లా అధ్యక్షులు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్‌లో మాత్రం ఈ పదవి ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో అసలు దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి నియామకంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నారు.

పీఏసీ సమావేశం తర్వాత..

రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ పార్టీ అధ్యక్షుల నియామకం జరగలేదు. త్వరలో హైదరాబాద్‌ లో పీఏసీ సమావేశం ఉంది. అందులో ఏదైన ని ర్ణయం జరగవచ్చు.అప్పటివరకు ఏమీచెప్పలేం.

– తాహెర్‌బిన్‌ హందాన్‌, పార్టీ జిల్లా పరిశీలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement