
● ఆగని రైతుల బలవన్మరణాలు ● పెట్టుబడి పెరిగి.. దిగుబడి త
జిల్లాలో ఈ ఏడాది రైతుల ఆత్మహత్యల వివరాలు..
● జనవరి 4న తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడ్డం పోతారెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● జనవరి 11న ఇంద్రవెల్లి మండలం పిప్పిరికి చెందిన కినక శంకర్ రుణమాఫీ రెన్యూవల్ కాకపోవడం, సాగుకు తెచ్చిన అప్పులు పెరగడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
● జనవరి 18న సాత్నాల మండలంలోని రేణుగూడకు చెందిన రైతు దేవ్‌రావు బ్యాంక్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● జనవరి 19న ఉట్నూర్‌లోని సేవదాస్‌నగర్‌కు చెందిన రాథోడ్ గోకుల్ కౌలు రైతు పంట దిగుబడి లేక కౌలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
● జనవరి 23న బేల మండలంలోని శంషాబాద్‌కు చెందిన కోడే గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు.
● జనవరి 25న బజార్‌హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్‌కు చెందిన మైల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంది పంటను అడవి పందులు ధ్వంసం చేయడం, అప్పులు పెరగడంతో తనువు చాలించుకున్నాడు.
● ఫిబ్రవరి 18న సాత్నాల మండలంలోని పార్డి(కె)కు చెందిన రైతు బోడ గిరి రాజు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో జొన్న సాగు చేయగా నీరందక పంట ఎండిపోయింది. అప్పులు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● నేరడిగొండ మండలంలోని వడూర్‌కు చెందిన ఈదాపు పోశెట్టి–ఈదారపు ఇందిర భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 5న భర్త చనిపోగా, 7న భార్య చనిపోయింది. పంటకు తెచ్చిన అప్పులు పెరగడంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు.
● తలమడుగు మండలంలోని సుంకిడికి చెందిన రైతు కుమ్మరి లింగన్న మార్చిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
● మార్చి28న బజార్‌హత్నూర్ మండలంలోని దేగామకు చెందిన మేకు విఠల్ పత్తి పంట దిగుబడి రాక, రుణమాఫీ కాక, మాడిగేజ్ లోన్, పంట రుణాలు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● ఏప్రిల్ 12న గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామానికి చెందిన కుమ్ర గోవింద్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● మే 19న సాత్నాల మండలం సుందగిరికి చెందిన కొక్కుల లస్మన్న పత్తి, సోయా పంటల దిగుబడి రాక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● జూన్ 3న ఉట్నూర్ మండలం శంభుగూడకు చెందిన షెడ్మకి పులాజీరామ్ అనే రైతు ప్రైవేట్ అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● జూన్ 27న తాంసి మండలం జామిడికి చెందిన మునేశ్వర్ అరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● జూలై 20న తలమడుగు మండలం కుచులాపూర్‌కు చెందిన సంతోష్ యాదవ్ రుణమాఫీ కాకపోవడం, పంటదిగుబడి రాకపోవడం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● ఆగస్టు 5న బజార్‌హత్నూర్‌కు చెందిన రైతు పడిపెల్లి విలాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కారణాలెన్నో..
రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వాల నుంచి పరిహారం అందకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం, పంట కోసం తెచ్చిన అప్పులు తీరకపోవడం, మెట్ట ప్రాంతాల్లో నీటి వసతులు లేకపోవడం, మార్కెట్లో దళారులు, వ్యాపారులు మోసం చేయడం వంటివి ఉంటున్నాయి. అలాగే పంటలు పండినా గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రైవేట్ దళారుల నుంచి తీసుకున్న అప్పులకు ఇబ్బందులు పెట్టడం, నకిలీ ఎరువులు, విత్తనాలతో పంటలు పండకపోవడం తదితర కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
జీవో 194 అమలు చేయాలి..
ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు. బతికి సాధించాలి. ప్రభుత్వం జీవో నం.194 అమలు చేయాలి. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.6లక్షల పరిహారం చెల్లించాలి. మరణించిన రైతు కుటుంబంలో ఒకరికి రూ.5వేల పింఛన్ ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందించాలి. డబుల్ బెడ్‌రూమ్ మంజూరు చేయాలి. ప్రభుత్వ చిరు ధాన్యాలను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కల్పించాలి. – బొర్రన్న,
రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు