
ఇక్కడ కనిపిస్తున్నది బజార్‌హత్నూర్ మండలం దేగామ గ్రామంల
ఇచ్చోడ: ఆయుష్ వైద్యం జిల్లా ప్రజలకు అందని దాక్షగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమిమోపతి(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ఆసుపత్రులు 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఆస్పత్రుల్లో మాత్రమే వై ద్యులు ఉండగా తొమ్మిదిచోట్ల వైద్యులు, సిబ్బంది లేక మూతపడ్డాయి. ఏళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. ఓ పక్క అల్లోపతి వైద్యం ఖరీదు కా వడం, తరచూ మాత్రలు వాడే వారు సైడ్‌ఎఫెక్ట్‌కు గురవుతుండడంతో పలువురు ఆయుర్వేద, హోమి యోపతి వైద్యం వైపు మళ్లుతున్నారు. ఈ వైద్యంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి.
ఏళ్ల నుంచి డాక్టర్లు లేరు..
జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సొనాల ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అలాగే నార్నూర్‌లో వైద్యుడి పోస్టు ఏడేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక బేల, జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, ఝరి, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్, తాంసి, నేరడిగొండ మండలకేంద్రాలతో పాటు వాంకిడిలో ఉన్న ఆస్పత్రులకు సైతం వైద్యులు కరువయ్యారు.
వైద్యులు, సిబ్బంది కరువు మూతపడుతున్న ఆయుర్వేద ఆస్పత్రులు ఆయుర్వేద, హోమియోపతి సేవలకు బ్రేక్
జిల్లాలో..
హోమియోపతి, ఆయుర్వేద ఆస్పత్రులు 15
ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య 6
ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు 9
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యపోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న చోట కొంత మందికి ఆదనపు బాధ్యతలు అప్పగించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– ప్రీతల్ రాథోడ్, డీపీఎం

ఇక్కడ కనిపిస్తున్నది బజార్‌హత్నూర్ మండలం దేగామ గ్రామంల