
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి●
● తెలియని లింక్‌లు వినియోగించొద్దు ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తెలియని వారికి ఓటీపీ చెప్పవద్దని, అలాగే తెలియని లింక్‌లు, అప్లికేషన్లు సెల్‌ఫోన్లలో వినియోగించవద్దన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ బారినపడ్డ వారు వెంటనే 1930కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఈ వారంలో 21 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. బాధితులు గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజినెస్ ఆఫర్లు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్‌లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మోసపోతున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆన్‌లైన్ వర్క్, వర్క్‌ఫ్రం హోం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని, వ్యాపారం, వ్యవసాయం నిర్వహిస్తూ ఎదగాలని సూచించారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.15లక్షలు మోసపోయాడని, భీంపూర్‌కు చెందిన మరో వ్యక్తి రూ.15వేలు, టూటౌన్ పరిధిలో ఒకరు రూ.62వేలు, బోథ్‌కు చెందిన యువకుడు రూ.26,750.. ఇలా అనేక మంది నష్టపోయారని తెలిపారు.
ఆదివాసీల సమస్యలపై నిరంతర పోరాటం●
● రాజ్‌గోండ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్
ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ సమస్యలపై రా జ్‌గోండ్ సేవాసమితి నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ అ న్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. ఆదివాసీ జాతికి రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. ఇప్పటికీ ఆదివాసీలపై అటవీ అఽ దికారుల దాడులు కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు ఆపకపోతే జా తీయస్థాయిలో వారిపై కేసులు పెట్టిస్తామన్నా రు. అలాగే దేశ వ్యాప్తంగా ఆదివాసీలు ఏకమై హక్కులపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సిడాం అర్జు, సెడ్మాకి ఆనంద్‌రావ్, తదితరులు ఉన్నారు.
ఆకట్టుకుంటున్న ‘దూరబంతి’
భీంపూర్: మండలంలోని గుబిడి గ్రామానికి వె ళ్లే అటవీ ప్రాంతంలో దూర బంతులు అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు ఈ ప్రాంతమంతా పచ్చదనంతో పాటు పూలతో కనువిందు చేస్తున్నాయి.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి●

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి●