
బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజ ర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ చే తులు దులుపుకోవడం సరికాదన్నారు. అధికా రంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు బిల్లుకు చట్టబ ద్ధత తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో అన్ని బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఇచ్చి న మోసపూరిత హామీలపై నిలదీస్తామని పే ర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గోవర్ధన్, మనోహర్, మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రాజన్న, స్వామి,లక్ష్మణ్, విఠల్, అశోక్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.