
‘సీసీఐని ప్రారంభించేదాకా పోరాడుతాం’
కైలాస్‌నగర్: మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్రం పునఃప్రారంభించేదాకా పోరాడుతామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఫ్యాక్టరీని తెరిపించాలనే డిమాండ్‌తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో 17రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష ముగిసింది. దీక్షలో కూర్చున్నవారికి ఆయన శుక్రవారం నిమ్మరసమిచ్చి విరమంపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినందున దీక్ష విరమిస్తున్నట్లు తెలి పారు. సీసీఐ ప్రారంభానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించామని పేర్కొన్నారు. వందేళ్లకు సరిపడా ముడిసరుకు కలిగిన ఫ్యాక్టరీ ప్రారంభమైతే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. సీసీఐ పునఃప్రారంభించేదాకా ఎన్ని పోరాటాలైన చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు డీ మల్లేశ్, విజ్జగిరి నారాయణ, సిర్ర దేవేందర్, దాసరి రమేశ్, పోశెట్టి, నగేశ్, రమేశ్, ఈశ్వర్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.