
బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు అందించాలి
ఎదులాపురం: బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు మే నెల నుంచి అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. బీడీ కార్మికుల వేతన పెంపుపై హైదరాబాద్‌లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ అనుబంధ) రాష్ట్ర నాయకులు, బీడీ యాజ మాన్య సంఘానికి మధ్య శనివారం జరిగి న చర్చలు సఫలం అయినట్లు తెలిపారు. ప్యాకర్లకు రూ.3,650, నెలసరి సిబ్బందికి రూ.1700 చొప్పున, బీడీలు చుట్టే వారికి వెయ్యి బీడీలకు రూ.4.25 పైసల చొప్పున కూలి పెంచుతూ ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. పెరిగిన వేతనాలు మే నెల నుంచే అందించాలన్నారు. ఇందులో ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సుభాష్, అశోక్, మారుతి తదితరులు పాల్గొన్నారు.