10న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఎదులాపురం: 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 10వ తేదీన ఉదయం 9.30నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈ వో ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను http// bse. telangana. gov. in నుంచి పొందవచ్చని సూచించారు.