కై లాస్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుల వివరాలకు సంబంధించిన వ్యయ ఖాతాల పరిశీలన తేదీలను ఖరారు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 17న మొదటి విడత, 21న రెండో విడత, 25న మూడో విడత పరిశీలన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశంలో చేపట్టనున్నారు. అలాగే బోథ్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యయ పరిశీలన ఈ నెల 18, 22, 26వ తేదీల్లో బోథ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు స్వయంగా లేదా వారి ఏజెంట్ల ద్వారా అకౌంట్ల పుస్తకాలను నిర్ణీత తేదీల్లో ఉదయం 10గంటల నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకుల ద్వారా పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటనలో సూచించారు.