breaking news
Yunus
-
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్‌లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్‌ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్‌ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్‌కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్‌కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ కు లేఖ రాసిన యూనస్
-
బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.2025లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్‌హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్‌లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్‌ను కోరింది.ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్ -
2026 జూన్‌లోగా బంగ్లా ఎన్నికలు: యూనస్
ఢాకా: బంగ్లాదేశలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని అన్నివైపుల నుంచి డిమాండ్లు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎప్పుడైనా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు.జపాన్ పర్యటనలో ఉన్న ముహమ్మద్ యూనస్ తాజాగా టోక్యోలో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో ఎన్నికల నిర్వహణలో రాజకీయ వర్గాలలో అసహనం నెలకొన్నదని, ఎన్నికలు పూర్తయ్యాక, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అప్పుడు వారికి తాము బాధ్యతలను అప్పగిస్తామని అన్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పాలని ప్రజలు పట్టుబడుతున్నారని, ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్యకాలంలో ఎన్నికలు నిర్వహించగలమన్నారు. ఎన్నికల సంస్కరణలు ఎంత త్వరగా చేయగలమనే దానిపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణలు(Electoral reforms) నెమ్మదిగా సాగితే ఎన్నికల నిర్వహణకు అధిక సమయం పడుతుందన్నారు. 2026, జూన్ నాటికి ఎన్నికలు నిర్వహించేవిధంగా పనిచేస్తున్నామన్నారు. మరోవైపు డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాతో సహా పలు నగరాల్లో బీఎన్పీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఎన్నికల కాలక్రమాన్ని వాయిదా వేయవద్దని తాత్కాలిక ప్రభుత్వాన్ని బీఎన్పీ నేత తారిఖ్ రెహమాన్ కోరారు.ఇది కూడా చదవండి: ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ -
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
బంగ్లాదేశ్: మైనర్లకూ ఓటుహక్కు.. యూనస్ సర్కారు నిర్ణయం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.18 ఏళ్ల లోపు వారు కూడా..మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్‌లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడు చేసిన ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)ఓటుహక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వ్యతిరేకించిన బీఎన్పీ2024 ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనానంతరం తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా యూనస్ నియమితులయ్యారు. ఆయన తాజాగా బంగ్లాదేశ్‌లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకించింది.కొత్త ఓటరు జాబితా కోసం..ఢాకాలోని జాతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో బీఎన్పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దీనివలన మరింత సమయం వృధా అవుతుందని, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అలంగీర్ పేర్కొన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆరోపించారు.రాజకీయ పార్టీలతో చర్చ జరగాలిదేశ అధ్యక్షుడు ఓటింగ్‌కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సివస్తుంది. అలాకాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌కే వదిలేసి ఉంటే బాగుండేది. అప్పుడు సరైన నిర్ణయం వెలువడేది. ప్రస్తుతం దేశంలో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదిస్తే సరిపోయేది. అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చ జరిగేదని ఆలంగీర్ అన్నారు. కాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షడు యూనస్ డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్థం మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయిని అన్నారు. ఓటరు జాబితాను సవరించాక ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
కీపిటప్..మహమ్మద్ యూనస్!
ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే కనిపించింది.ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఒకరు ఆత్మహత్య అని..అలా మరో పేజీ తిప్పానో లేదో సివిల్స్‌లో ఫెయిలయ్యానని బలవన్మరణం అంటూ మరోవార్త ఇదేమిటి చిన్నచిన్న కారణాలతో ఇలా చనిపోవడాలు అనిపించింది.అప్పుడే నిన్న కలిసిన మహమ్మద్ యూనస్ గుర్తొచ్చాడు.. బతుకంతా కష్టాలు ఎదుర్కొన్నా అతడి మొహంలో చెదిరిపోని ఆ చిరునవ్వు గుర్తొచ్చింది.అంగవైకల్యం వెనక్కులాగుతున్నా..ముందుకు దూసుకెళ్లాలన్న అతడిగుండెధైర్యం ఈ ఆత్మహత్యల వార్తల సమయంలో మరీ గుర్తొచ్చింది. ఆ మహమ్మద్ యూనస్ ఎవరో తెలుసుకుందాం. ఓ సాక్షి పాఠకుడి మాటల్లో అతడి కథను విందాం ఓ ఆయుర్వేద మందుల దుకాణంనుంచి మెడిసిన్స్ తెప్పించాలి. దాంతో ఒక బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్‌లో రైడర్‌ను బుక్ చేసుకుని మందులు ఇంటికి తెప్పించుకు న్నాను. కిందకు వెళ్లి అడిగాను.. డెలివరీ బాయ్ వచ్చాడా అని.. అప్పుడు నేనేనండి అంటూ నవ్వుతూ వచ్చాడు మహమ్మద్ యూనస్.. చూడగానే ఆశ్చర్యం కలిగింది.. ఎందుకంటే.. తను దివ్యాంగుడు.. ఎప్పుడూ ఈ పనిలో దివ్యాంగులను చూడని నేను ఆసక్తి తో అతడి వివరాలు అడిగాను.. అప్పుడు చెప్పాడు.. 36 ఏళ్ల యూనస్ తన కథ.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ చెందిన యూనస్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. శరీరం సహకరించక పోయినా ఇంటర్ పూర్తి చేశాడు. ఒక మీడియా సర్వీసెస్ సంస్థలో పదేళ్లు పనిచేశాడు. అది మూతపడ్డాక ఒక మొబైల్ షాపులో చేరాడు. పైగా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత ఇతడి మీదే పడింది. లాక్‌డౌన్‌తో ఆ మొబైల్ షాపు కాస్తా మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఇదే సమయంలో అనారోగ్యంతో తన 6 నెలల బిడ్డనూ పోగొట్టుకున్నాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. కానీ గుండె ధైర్యం మాత్రం సడలలేదు. లాక్డౌన్ సడలించాక ఒక బైక్ ట్యాక్సీ యాప్ వేదికగా రైడర్‌గా మారాడు. ‘ఈ నా బండిని చూసి రోజూ ఒకరిద్దరు రైడ్ క్యాన్సిల్ చేసుకునేవారు. కన్నీళ్లు వచ్చేవి. నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారని చాలా బాధపడ్డాను. అయితే.. బతకాలంటే పని చేయాలి. అందుకే పరుగు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. రైడ్ లేకపోతే సరుకు డెలివరీ అయినా ఉంటుంది. రోజూ ఖర్చులుపోను ఇంటికి రూ.300 దాకా తీసుకువెళతాను. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా రైడ్ ఆగదు.. సార్’ అంటూ చిరునవ్వుతో సెలవు తీసుకున్నాడు యూనస్. ‘ప్రభుత్వం నుంచి రుణం అందితే ఇంటి దగ్గర మీ సేవ లేదా మొబైల్/కిరాణా దుకాణం పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది.. సార్’ అని తన మనసులోని మాట చెప్పాడు. ఈ ఆత్మహత్యల వార్తలు చదివాక.. యూనస్‌ను చూశాక అనిపించింది. మనం చూడాల్సింది నిరాశ అనే నిశీధిని కాదు.. దాన్ని తరిమేసే ఆ చిరుదివ్వెను.... కష్టాల చీకట్లో మగ్గుతున్న ఎంతోమందికి ఈ యూనస్ కథ ఒక చిరుదివ్వెనే... కీపిటప్.. మహమ్మద్ యూనస్.. -
సర్వే కోసం శిథిల గృహంలో..
పరిగి: సమగ్ర కుటుంబ సర్వే అనగానే ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. స్వగ్రామంలో సొంత ఇల్లున్నా ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని వెళ్లినవారు కొందరైతే.. ఉన్న ఇళ్లు శిథిలమై తిరిగి కట్టుకోలేని దీన స్థితిలో పట్టణాలకు వలస వెళ్లినవారు మరికొందరు ఉన్నారు. సర్వే పుణ్యమా అని ఊరికి వచ్చిన ఓ కుటుంబం శిథిలమైన ఇళ్లలోనే కూర్చుండి కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మాదారానికి చెందిన ఎం.డి.యూసుఫ్, యూనూస్, ఖాసీం సోదరులు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా కలిసుండేవారు. ఏళ్ల క్రి తం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. దీంతో అన్నదమ్ములంతా ఎవరికి వారు వేరే గ్రామాలకు వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కూలిపోయి మిగిలిన నాలుగు గోడల మధ్యే సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వంఇల్లు మంజూరు చేయాలని కోరారు.