breaking news
row
-
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
భారత్‌లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్‌పోర్ట్‌ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్‌లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. పాస్‌పోర్ట్ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్‌పోర్ట్‌కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.అమెరికాలో.. ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్‌పోర్ట్‌కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ..అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్ లా దేశాల్లో కూడా పాస్‌పోర్ట్‌కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.యూరప్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల్లో పాస్‌పోర్ట్ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్ యూనియన్‌లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్‌పోర్ట్ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.మరి భారత్‌లాంటి దేశాలు ఉన్నాయా?అవును.. భారత్ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్‌పోర్ట్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్‌షిప్ సర్టిఫికెట్(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్‌తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.అసలు ఎన్ని దేశాలు పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్‌పోర్ట్‌కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.భారత్‌లో వివాదం ఎందుకంటే.. భారత్‌లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్ సిటిజన్‌షిప్ డాక్యుమెంట్" లేదు. ఆధార్ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.చర్చ ఎటు దారితీస్తోంది?పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్‌లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్‌పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్‌లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది. -
Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎదురుదెబ్బ
నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. నోట్ల కట్టల వ్యవహారంలో తన అభిప్రాయాన్ని విచారణ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, తనను తొలగించాలన్న ఆ కమిటీ నివేదిక చెల్లదని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని మార్చలేదని తెలిపిన సుప్రీం కోర్టు.. అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయడం రాజ్యాంగ వ్యతిరేకమేమీ కాదని వ్యాఖ్యానించింది.‘‘భారత ప్రధాన న్యాయమూర్తి, ఇన్‌హౌజ్ కమిటీ యధావిధిగా తమ ప్రక్రియను అనుసరించారు. అయితే ఈ కేసులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయకపోవడం అవసరం లేనిదే. అయితే అప్పట్లోనే మీరు దీనిని సవాల్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసినా దాని ప్రభావం లేకుండా పోయింది. ఇన్ హౌజ్ విచారణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది ఏం కాదు. ఇది న్యాయ వ్యవస్థలో నైతికతను కాపాడేందుకు రూపొందించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఒక పోస్ట్ ఆఫీస్ కాదు.. చర్యలకు తీసుకునే బాధ్యత సీజేఐకి ఉంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్లో జస్టిస్ యశ్వంత్ వర్మ.. పిటిషన్‌ను అజ్ఞాత పేరుతో దాఖలు చేశారు. అలాగే దర్యాప్తు కమిటీ తనను సరిగా విచారించలేదని, తన వాదనలకు అవకాశం ఇవ్వలేదని కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఈ విషయంలో న్యాయ ప్రక్రియ ఉల్లంఘించబడిందని, తాను మీడియా ట్రయల్‌కు(మీడియా కథనాలపై) లోనయ్యాను అని పిటిషన్లో తెలిపారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి ప్రముఖ లాయర్లు వాదనలు వినిపించడం గమనార్హం. అదే సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో భాగం కావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగి మరో బెంచ్‌కు బదిలీ చేశారు.కేసు నేపథ్యం:2025 మార్చి 14: ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పే సమయంలో నోట్ల కట్టలు కాలిన స్థితిలో ఓ రూమ్‌లో బయటపడ్డాయిసుప్రీం కోర్టు స్వయానా విడుదల చేసిన వీడియోలో నగదు ముద్దలు కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.న్యాయవ్యవస్థపై అవినీతి విమర్శలు రావడంతో తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయించి విచారణ జరిపించారు. ఈ కమిటీ మే 3న నివేదిక అందించగా.. మే 4న నివేదికను రాష్ట్రపతికి పంపించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. వర్మ తొలగింపు సిఫార్సు చేశారు.అభిశంసన ఇప్పట్లో కష్టమే!అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో విచారణ జరగడం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సెషన్లో ఆయన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘మేం వాళ్లలా కాదు’: గుజరాతీయుల బాషా మర్యాద
న్యూఢిల్లీ: దేశంలో బాషా వివాదాలు నడుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో అవి తారాస్థాయికి చేరాయి. రాజకీయాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ బాషాభిమానం పొంగిపొర్లుతున్న వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడిన గుజరాతీయులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గుజరాత్‌కు సంబంధించిన ఈ వీడియోలో గుజరాతీ బాష తెలియని వ్యక్తితో స్థానికులు హృదయపూర్వకంగా హిందీలో మాట్లాడటం కనిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ జై పంజాబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అతను గుజరాత్‌కు చెందిన పలువురిని ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఇంటర్వ్యూ ప్రారంభంలో, తాను గుజరాత్లో నివసిస్తున్నప్పటికీ, తనకు గుజరాతీ బాష మాట్లాడటం రాదని, అర్థం చేసుకోలేనని అతను స్పష్టంగా చెబుతాడు.ఈ సమయంలో అతను ఇంటర్వ్యూ చేసిన ప్రతీ ఒక్కరూ హిందీలో మాట్లాడేందుకు అంగీకరించారు. వారు హిందీలో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి వచ్చే అతిథులకు గుజరాతీ రాకపోయినా, వారిని స్వాగతించడం గుజరాతీయుల విధి అని అన్నారు. మీకు గుజరాతీ తెలియదు కనుకనే తాము హిందీలో మాట్లాడుతున్నామని, లేనిపక్షంలో గుజరాతీలో మాట్లాడేవారిమని తెలిపారు. ఇతరులతో హిందీలో మాట్లాడేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గుజరాతీయులు స్పష్టం చేశారు. View this post on Instagram A post shared by Jai Punjabi (@jaipunjabii) -
హెచ్‌సీయూ వివాదం.. ఫేక్ పోస్టులపై ఇన్‌డెప్త్ ఇన్వెస్ట్‌గేషన్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలు, AI ఫేక్ ఫోటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్పోస్ట్లపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ పోస్ట్‌లను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టీ వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఫేక్ పోస్ట్‌లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా యూఆర్ఎల్తో సహా పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రెటీలు పోస్ట్‌లు తొలగించినట్లు పోలీస్ శాఖ గుర్తించారు. -
ఇందిరాగాంధీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా శుక్రవారం అవినాష్ మాట్లాడుతూ మేం మహిళల కోసం ‘లక్పతి’ దీదీ స్కీమ్ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హాయంలో మీ ‘దాదీ’ పేరుతో స్కీములు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరాగాంధీపై మంత్రి కావాలని చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.అయితే స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఇందుకు ఒప్పుకోలేదు.దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకున్నారు.సభ నడవకుండా అడ్డుకుంటుండంతో ఆరుగురు కాంగగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.పార్లమెంట్లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్ అసెంబ్లీలోనూ వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. -
‘అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారు?’
కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వార్తల్లోకెక్కిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించగా.. ఇవాళ మరోసారి ఆందోళన చేపడతారేమోననే అనుమానంతో కాలేజ్ యాజమాన్యం భయపడింది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. హాస్టల్ నుంచి విద్యార్థులను పంపించేస్తోంది.ఈ క్రమంలో విద్యార్థులు ఎదురుతిరగారు. అందరినీ బయటకు పపించాక ఎవరిని విచారణ చేపడతారని యాజమాన్యాన్ని నిలదీశారు. తాము హాస్టల్లోనే ఉంటామని భీష్మించుకుని కూర్చుకున్నారు. మరోవైపు.. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు కాలేజీ బయట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టాయి. వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు.ఇదీ చదవండి: రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు! -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..
ఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్‌కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. If Rahul Gandhi wants to give flying kiss he has many women available He won’t give it to a 50 year old budhiya Congress MLA from Bihar : Neetu Singh Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023 నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్‌పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: బ్రిటీష్ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు -
కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు
పీఎం పాలెం (భీమిలి): ఏదైనా గొడవ జరిగితే సామాన్యులు వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. అటువంటిది.. ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు గొడవ పడటమేగాక కొట్టుకున్నారు. ఇద్దరూ గాయపడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ ఆరో వార్డులోని పీఎంపాలెం ఆఖరు బస్టాప్ సమీపంలోగల షిప్‌యార్డు కాలనీలోని శ్రీనిలయం అపార్టుమెంట్లో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్, వీఆర్‌లో ఉన్న సీఐ రాజులనాయుడు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరిద్దరు సెల్లార్‌లోని కారు పార్కింగ్ విషయంలో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సీఐలతో పాటు వారి కుటుంబసభ్యుల మధ్య మరోమారు వివాదం తలెత్తింది. కొట్లాటకు దారితీసింది. సీఐలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సీఐ ప్రేమ్‌కుమార్ 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లి ఘర్షణపై వివరాలు సేకరించారు. మంగళవారం సీఐలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (క్లిక్: ఔను.. ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
మసీదుల్లో మందిరాలను పునరుద్ధరించి తీరతాం!: ఎమ్మెల్యే ఈశ్వరప్ప
బెంగళూరు: మసీదుల్లో మందిరాల ఉనికిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. 36,000 ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులు కట్టారని, వాటన్నింటిని పునరుద్ధరించి తీరతామని శపథం చేస్తున్నాడాయన. కర్ణాటక డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప పై కామెంట్లు చేశాడు. మందిర్-మసీద్ వ్యవహారంపై మీడియా సాక్షిగా శుక్రవారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలను ధ్వంసం చేసి.. వాటిపై మసీదులు కట్టారు. వేరే ఎక్కడైనా మసీదులు కట్టి.. నమాజ్‌లు చేసుకోండి. అంతేగానీ, ఆలయాల మీద మసీదులను అనుమతించేదే లేదు. ముప్పై ఆరువేల ఆలయాలను హిందువులు తిరిగి అదీ లీగల్‌గా చేజిక్కించుకోవడం ఖాయం అని పేర్కొన్నారు ఆయన. జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో ఉన్న వేళ.. కర్ణాటకలోనూ అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. మంగళూరు దగ్గర ఓ పాత మసీదులో రిన్నోవేషన్ పనులు జరుగుతుండగా.. హిందు ఆలయం తరహా నమునాలు వెలుగు చూశాయి. దీంతో.. వీహెచ్‌పీ నేతలు పనులు ఆపించాలంటూ జిల్లా అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈశ్వరప్ప గుడులను పునరుద్ధరించి తీరతామని వ్యాఖ్యానించడం విశేషం. ముస్లింలందరూ చెడ్డవాళ్లు కారని, అలాగని ఆలయాలపై మసీదులు నిర్మించి నమాజ్‌లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఒక మసీదు ఉందంటే.. అది కచ్చితంగా శివుడి ఆలయమే అయ్యి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈశ్వరప్ప కామెంట్లపై కాంగ్రెస్ మండిపడుతోంది. న్యాయస్థానాల్లో వ్యవహారం ఉండగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తోంది. K S Eshwarappa: ಮಸೀದಿ ಇದ್ದಲ್ಲಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯ ಆಗಿಯೇ ಆಗುತ್ತೆ ಎಂದ ಈಶ್ವರಪ್ಪ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #karnatakanews #UpdateNews #Eshwarappa #latestnews #GyanvapiMosque Watch:https://t.co/4IxRcaVlTY pic.twitter.com/gltJOr0alm — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 K S Eshwarappa: ‘ಎಲ್ಲಾ ಮುಸ್ಲೀಮರು ಕೆಟ್ಟವರು ಅನ್ನುವುದಿಲ್ಲ’ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #Muslim #Eshwarappa #KarnatakaTak #latestnews Watch:https://t.co/Wm05PslukR pic.twitter.com/LjkX7B3yQ5 — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 -
హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్
మంగళూరు: కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై జరుగుతున్న వివాదం యువత మనసులను విషపూరితం చేసే కుట్రలో భాగమని కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. మంగళూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వస్త్రధారణపై జరుగుతున్న వివాదాలు మన దేశాన్ని అవమానం పాల్జేచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, పెట్రో ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా హిజాబ్ ధరించడం వంటి సున్నితమైన విషయాలను స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వాడుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పంథాను అనుసరిస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉందని, హిజాబ్ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక కోస్తా ప్రాంతం తనదైన చరిత్ర, సంస్కృతి, మానవ వనరులను కలిగి ఉందని.. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిందని శివకుమార్ తెలిపారు. హిజాబ్ వివాదానికి ఆజ్యం పోసి యువత మనసుల్లో విషం నింపే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ) -
మన వాట్సాప్ చాట్ సురక్షితమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు మాదక ద్రవ్యాల కేసుగా మారడం, ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ స్పందించింది. ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, దీంతో యూజర్ల భదత్రకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. వాట్సాప్ మెసేజ్ లు పూర్తిగా సురక్షితమని, ధర్డ్ పార్టీలు వాటిని యాక్సెస్ చేయలేవంటూ యూజర్లకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది. (డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తద్వారా మీరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్‌ను మాత్రమే వాట్సాప్‌లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్వర్డ్లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్‌ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారింది. ఈ చాట్ల ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసింది. -
ఓట్ల కోసమే రాహుల్ హిందుత్వ అవతారం
సాక్షి, అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని ప్రధాన దేవాలయాలను హిందూ ఓట్లకోసమే రాహుల్ సందర్శిస్తున్నారని ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించడం వెనుక ఓట్లు.. సీట్లే ప్రధాన కారణమని ఆమె అన్నారు. ‘భగవంతుడి అద్భుతాలు చూడాలనుకునేవారికి.. ఇదే పెద్ద నిదర్శనం’ రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయాన్ని దర్శించడంపై ఇరానీ వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాక రాహుల్ గాంధీ జంధ్యెం ధరించిన ఫొటోపైనా ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు. హిందువుగా జీవించేవాడు.. ఆవును గౌరవిస్తాడు.. ఆవుని పూజిస్తాడు..అంతేకానీ గోహత్యలను సమర్థించరంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిచి ఇరానీ వ్యాఖ్యానించారు. -
వివాదంలో ఓలా, ఫౌండర్స్‌పై కేసు
బెంగళూరు: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా వివాదలో ఇరుక్కుంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలతో బెంగళూరు పోలీసులు ఓలా ఫౌండర్స్‌పై కేసున మోదు చేశారు. ఓలా ప్లే ప్లాట్‌ఫారమ్ ద్వారా చలనచిత్ర పాటలను చోరీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకు బెంగళూరుకు చెందిన రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓలా ప్లే ప్లాట్‌ఫాం ద్వారా పైరేటెడ్ సినిమా పాటలను వాడుతున్నారని మ్యూజిక్ సంస్థ లహరి రికార్డింగ్ కంపెనీ లిమిటెడ్. ఓలా మాతృ సంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్‌పై ఫిర్యాదు చేసింది. తాము ఆడియో హక్కులను కొనుగోలు చేసిన కన్నడ , తెలుగు సినిమాల నుండి పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఆరోపించింది. కర్ణాటక, ఢిల్లీ, కోల్‌కతా తమిళనాడులో వీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని మ్యూజిక్ కంపెనీ ఆరోపించింది. దీంతో పోలీసులు ఓలా కార్యాలయంపై దాడి చేసి, పాటలను డౌన్లోడ్ చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఎన్ఐ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓలా ఫౌండర్స్ భవిష్ అగర్వాల్ , అంకిత్ భతీపై కేసు నమోదు చేశారు. -
అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది. ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది. -
సల్మాన్ ట్వీట్లపై మండిపడ్డ తండ్రి


