Milk adulteration
-
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
ఫిబ్రవరి 15న రాత్రి పాల రూపంలో చేతికందిన కాలకూట విషం తాగి ఆస్పత్రుల పాలయ్యారు. చివరకు కిడ్నీలు పాడై రోజుకొకరు, ఇద్దరు చొప్పున ఓ చిన్నారి సహా 16 మంది.. సర్కారు నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఇప్పటికే పాడెక్కారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు ఆస్పత్రుల్లోనే మరణ వేదన అనుభవిస్తుండగా.. వారి అవస్థల్ని చూడలేక ఆ కుటుంబాలు ఇప్పటికీ నరకయాతన పడుతున్నాయి. మొత్తానికి దేశంలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న రాజమహేంద్రవరం ‘పాల’కూట విషపు మృత్యుఘోష ‘ఈ పాపం ఎవరిది బాబూ!’ అని బిగ్గరగా ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల 2015 గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించగా.. మరో ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ముందు అదే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కల్తీ పాల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని రాజమహేంద్రవరం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. (యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఎస్.ఫయాజ్/రాజమహేంద్రవరం) ‘రాజమహేంద్రవరం పాల కల్తీ కాటుపై చంద్రబాబు సర్కారు స్పందించడం లేటయ్యింది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరినప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై.. అందుకు కారణాలు నిర్ధారించి.. తక్షణ చర్యలు చేపట్టి ఉంటే 16 ప్రాణాలు నిలిచేవి. మరో నలుగురి ప్రాణాలు కొనఊపిరితో బిక్కుబిక్కుమనేవి కాదు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులు వారం రోజుల తర్వాత తమ అస్వస్థతకు కల్తీ పాలే కారణమని చెప్పాక.. ప్రభుత్వం తీరుబడిగా స్పందించింది. వైఎస్సార్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాకే చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు’ రాజమహేంద్రవరంలో ఎవరిని కదిపినా ఇవే మాటలు చెబుతున్నారు. బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. వారు చనిపోయాక అరకొర పరిహారం అందించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారిని కోల్పోయి.. ప్రైవేట్ వైద్యానికి రూ.లక్షలకు లక్షలు దొరికిన చోటల్లా అప్పులు చేసిన కుటుంబాలు నెల రోజులు గడిచినా మనోవేదన నుంచి బయటపడలేదు. బాధితుల కుటుంబ సభ్యులను కదిలిస్తే.. కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న సన్నివేశాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందిఒక్కో కుటుంబానిదీ ఒక్కో విషాదం చౌడేశ్వరి నగర్‌లోని గుండాబత్తుల ఫణి మధుకుమార్ ఇంటిని విషాదం వెంటాడుతోంది. కల్తీ పాలకు ఆయన తల్లి వెంకటలక్ష్మి (70), పెద్దనాన్న గంటా సూర్యారావు (80), పిన్ని రఘుపతి సూర్యకుమారి (62) బలైపోయారు. మధు తండ్రి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయనకు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. అయినా గ్యారంటీ లేదని వైద్యులు చెబుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన కుయ్యోటి ఛాయశ్రీ (54) కల్తీ పాలు తాగి ఫిబ్రవరి 16న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజమహేంద్రవరం డెల్టా ఆస్పత్రిలో చేరి్పంచగా.. క్రియాటినిన్ పెరిగిపోవడంతో కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది. డయాలసిస్ చేసినా ఫలితం లేక కిడ్నీకి స్టెంట్ వేశారు. అయినా పరిస్థితి విషమించడంతో ఛాయశ్రీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆమె భర్త మురళీకృష్ణ నగరంలోని రవి చైతన్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20న ప్రాణాలు కోల్పోయింది.ఆమె మరణాన్ని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోలేదు. అదేమంటే పోస్టుమార్టం చేయలేదనే సాకుతో పరిహారం ఎగ్గొట్టింది. ఇప్పటికే జయలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంక్ బోర్డు తిప్పేయడంతో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు కోల్పోయానని, కొందరిని నమ్మి రూ.10 లక్షల అప్పులు ఇస్తే ఎగ్గొట్టారని మురళీకృష్ణ తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న తాను ఇప్పుడు భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానన్నారు.అనుమానాలను నివృత్తి చేయని సర్కారు పాలలో ఇథలీన్ గ్లైకాల్ కలవడమే బాధితుల మృతికి కారణమని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి కల్తీ పాలు, బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ల్యాబ్‌ల నుంచి వచి్చన వాస్తవ నివేదికలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి ఇథలీన్ గ్లైకాల్ కలిస్తే పాలు నీలం రంగులోకి మారిపోతాయని.. అయితే, బాధితులు తాగిన పాలు రంగు మారలేదని చెబుతున్నారు. మరికొందరు గడ్డి మందు ఏమైనా కలిసిందేమో అంటున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం పోటీలో ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందితే పాలల్లో కల్తీ ఎలా జరిగింది?, ఏం కలిసింది?, బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేంటి? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాల పదార్థాలు తీసుకోవాలన్నా, టీ తాగాలన్నా జనం వణికిపోతున్నారు. గణేష్ సరఫరా చేసిన పాల నుంచి వెన్న సేకరించి నెయ్యిగా దాచుకున్న వారు ఉన్నారని.. వారిని అప్రమత్తం చేయడం, పాల కల్తీపై అవగాహన కల్పించండంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వాపోతున్నారు. వైద్యానికే రూ.4.50 లక్షలైంది ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజినీర్ శేషగిరిరావు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కుమారుడు, కోడలు విషయం తెలుసుకుని వచ్చి ఆయనను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైద్య ఖర్చులు రూ.4.50 లక్షలయ్యాయి. ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాల్సి ఉంది. భర్త బతికాడు.. భార్య ప్రాణం పోయింది శివరాత్రి రోజు రాత్రి కల్తీ పాలతో కాఫీ కలిపి బండారు వీరలక్ష్మి (60) తన భర్త నాగమోహనరావుకు ఇచ్చింది. పాలు చేదుగా ఉన్నాయని గుర్తించిన భర్త ఆ కాఫీ తాగకుండా పారబోశారు. ‘కాఫీ పొడి ఎక్కువ వేసి ఉంటాను. అందుకే చేదుగా ఉందని చెప్పిన భార్య చేదు అనిపించినా కాఫీ తాగింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. తన భార్య కూడా ఆ కాఫీ తాగకుండా ఉంటే బతికేదని నాగమోహనరావు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రసాదం తిని పాప బతికింది లాలాచెరువు ప్రాంతానికే చెందిన జి.నాగవెంకటేష్ కు జైక్రిత్ రాజ్, జయ హిమాన్షి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండున్నరేళ్ల వయసున్న వారిద్దరికి పాలు కలిపి ఇస్తే జైక్రిత్ తాగాడని.. అప్పటికే దేవుడి ప్రసాదం తిన్నందున జయ హిమాన్షి తాగలేదని చిన్నారుల తాతయ్య ప్రకాశరావు చెప్పారు. పాలు తాగి అస్వస్థతకు గురైన జైక్రిత్ రాజ్‌ను కాపాడుకునేందుకు అప్పులు చేసి ఎంత ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని అతడి తాతయ్య ఆవేదనతో చెప్పారు. పరిహారంలోనూ పరిహాసమే కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సైతం బాధిత కుటుంబాలను పరిహసిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిందని బాధితులు వాపోతున్నారు. అయిన వారిని కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేసిన కుటుంబాలకు వైద్య ఖర్చులను తక్షణం చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శేషజీవితం ప్రశాంతంగా గడుపుదామని వచ్చి.. విశాఖపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైరైన మంచి రాధాకృష్ణమూర్తి (72) శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. కుమార్తెతోపాటు అయిన వారంతా ఇక్కడే ఉండటంతో ఆనందంగా గడపాలని భావించి ఇక్కడ స్థిరపడ్డారు. ఇటీవల కల్తీ పాలు తాగడంతో యూరిన్ ఆగిపోయి పరిస్థితి సీరియస్ అవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి ఎంత ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె గడిశెట్టి వెంకటదుర్గ ఆవేదనతో తెలిపారు. పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నాం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమ్మను చూసేందుకు చిన్నపిల్లలతో సహా రాజమండ్రికి వచ్చిన తాము పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నామని వియ్యూరి రాజేష్ తెలిపారు. శివరాత్రికి రెండు రోజుల ముందే తాను కుటుంబంతో హైదరాబాద్‌కు, తన తమ్ముడు జగన్నాథ్ వైజాగ్‌లోని అత్తారింటికి వెళ్లాడని చెప్పారు. శివరాత్రి తర్వాత రోజున తన తల్లి గొంతునొప్పి, చెవుల్లోంచి చీము కారడం, కళ్లు మంటలు ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందన్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. తాము కూడా అక్కడే ఉంటే పాలు, మజ్జిగ, టీ తాగి ఉండే వాళ్లమని.. అదే జరిగితే తన రెండేళ్ల కుమారుడు, తన తమ్ముడి 7 నెలల కొడుకు పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తోందని రాజేష్ చెప్పారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
పాలు మంచి పోషక పదార్థం. అందుకే పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఆరోగ్యపరంగా పాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతుంటారు. కానీ.. మార్కెట్లో నాణ్యమైన స్వచ్ఛమైన పాలు లభించడం గగనమవుతోంది. వ్యాపారమే పరమావధిగా చేసుకుని పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజార్యోగం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం అగ్రికల్చర్: పాల కల్తీ ప్రాణాలు హరిస్తోంది. ఇది వరకు పాలల్లో నీళ్లు మాత్రమే కలిపేవారు. ఇప్పుడు కొందరు అత్యాశకు పోయి నీళ్లతో పాటు రంగు, రుచి, చిక్కదనం కోసం యూరియా, ఫార్మలిన్, హైడ్రోజెన్ పెరాక్సైడ్, మాల్డోడెక్స్ట్రిన్, డిటర్జెంట్స్ లాంటి రకరకాల ప్రమాదకర రసాయనాలు, హానికరమైన పదార్థాలు కలిపి పాల అమ్మకాలు చేస్తున్నారు. ఇలాంటి పాల కల్తీ దందా గుట్టును ఏడాది కిందటే అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేసిన విషయం తెలిసిందే. పాలలో హానికరమైన ‘మాల్డోడెక్స్ట్రిన్’ కలుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి అప్రమత్తం చేశారు. తాజాగా రాజమండ్రిలో కల్తీపాలు తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. పశు శాఖ అధికారుల నిర్లక్ష్యం.. పాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, కల్తీ, నాసిరకం అనే అంశాలు తమకు సంబంధం లేదన్నట్లుగా పశు సంవర్ధక శాఖ అధికారులు మౌనం పాటిస్తున్నారు. పశువైద్యం, పశుసంతతి పెంపు, పథకాల అమలు వరకే తమ పని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం జిల్లాలో రోజుకు ఎన్ని లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది, అందులో ప్రైవేట్ డెయిరీలు ఎన్ని సేకరిస్తున్నాయి, బయట వ్యాపారులు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు, ఇతరత్రా రూపాల్లో సాగిస్తున్న అమ్మకాల వివరాలు చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారు. రోజుకు 5 లక్షల లీటర్లు అని ఒక అధికారి, లేదు లేదు 8 నుంచి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి అంటూ మరో అధికారి, అదీ కాదు... 13 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోందని ఇంకో అధికారి... ఇలా కచ్చితమైన లెక్క చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. మిల్క్ యాక్ట్ ఏం చెబుతోందంటే..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం, కల్తీపాలను అరికట్టాలనే ఆలోచనతో 2023లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాల రక్షిత ప్రమాణాల అమలు చట్టం (మిల్్కయాక్ట్)ను తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు, ఇతరత్రా పాల సేకరణ, అమ్మకాలు సాగించే దుకాణాలు, ప్రాంతాల్లో పాల నాణ్యత తెలుసుకునే అధికారం పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించారు. జిల్లాలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్స్ సర్జన్స్ (వీఏఎస్) అందరూ ‘మిల్క్ ఇన్స్పెక్టర్లు’గా పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మిల్క్యాక్ట్పై శిక్షణ కూడా ఇచ్చారు. మిల్క్ యాక్ట్ ప్రకారం పాల సేకరణ కేంద్రాలు (మిల్క్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు) తప్పనిసరిగా రూ.1,500 చెల్లించి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తనిఖీకి వచ్చినప్పుడు లైసెన్సు లేకుంటే మొదటి దఫా కింద రూ.50 వేల జరిమానా, రెండోసారి కూడా పట్టుబడితే రూ. లక్ష జరిమానా, ఆరు నెలల వరకు జైలుశిక్ష కూడా ఉంటుంది. కల్తీ, నాసిరకమని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం..మిల్క్ ఇన్స్పెక్టర్లు తరచూ పాల సేకరణ కేంద్రాలను తనిఖీ చేయాలి. పాల నాణ్యత పెంచి.. నాసిరకం, కల్తీని నివారించాలని మిల్్కయాక్ట్ చెబుతోంది. కానీ మిల్క్ ఇన్స్పెక్టర్లు తమ బాధ్యతల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ‘కల్తీ’ నిరాటంకంగా కొనసాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరం, పట్టణాలే కాదు.. ఇప్పుడు మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా ‘కల్తీ’ యథేచ్ఛగా సాగిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప నాణ్యమైన పాలు, వాటి ఉత్పత్తులు ప్రజలకు అందే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలు మాత్రమే కల్తీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పాల ద్వారా తయారయ్యే పెరుగు, మజ్జిగ, పాలపొడి, వెన్న, నెయ్యి, స్వీట్లు, ఐస్‌క్రీమ్, పన్నీర్, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులు కూడా కల్తీ అయినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణసమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, పేగుల వాపు, గ్యాస్ట్రిక్, విరేచనాలు తదితర ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. -
కల్తీ పాలు తాగి మనుషులు చనిపోతుంటే మీకు క్రికెట్ ఆటలు కావాలా..?
-
కల్తీ పాల ఘటన.. బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వివిధ ఆసుపత్రిలో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధితుల పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాధితులకు చికిత్స కోసం యాంటీడోట్ తెప్పించామని అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలో వెంటిలేటర్‌పై ఇద్దరు, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్, ఏడుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాలలో ఏ పదార్థాలు కలిశాయో ఇప్పటివరకు ల్యాబ్ రిపోర్టులో స్పష్టం కాలేదు. ల్యాబ్ రిపోర్ట్ రాకుండా యాంటీ డోట్ ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితిలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇద్దరికి అనూరియా లక్షణాలు బయటపడ్డాయి.ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్ గ్లైకాల్ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు.అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి ల్యాబ్‌కు రక్త నమూనాలు ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు. -
కల్తీ పాల విషాదానికి సంబంధించి వెలుగులోకి సంచలన విషయాలు
-
అంతా కల్తీ.. హెరిటేజ్ గుట్టురట్టు
-
కల్తీపాల కలకలం
జగద్గిరిగుట్ట: ప్రగతినగర్‌లో కల్తీ పాల సంఘటన కలకల రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు స్థానిక సాయితేజ మిల్క్ సెంటర్ నుంచి ఈ నెల 8, 9 తేదీల్లో గేదె పాలను కొనుగోలు చేశారు. అందులో ఒక ప్యాకెట్లోని పాలను వేడి చేయగా విరిగి పోయి ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. పాత్ర ప్రభావం కారణంగా పాలు పాడై ఉండవచ్చునని భావించిన వారు మరో ప్యాకెట్పాలను వేడి చేయగా అవి అలాగే మారాయి. దీంతో మిల్క్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా అతను దురుసుగా ప్రవర్తించడంతో శుక్రవారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అశోక్ పాలను ల్యాబ్‌కు పంపారు. పరీక్షించిన తరువాత కల్తీగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆయిల్ మిల్క్
అనంతపురం, నార్పల: నియోజకవర్గం లోని నార్పల పరిధిలో కల్తీపాల గుట్టు రట్టైంది. పోలీసులు ఏకకాలంలో దా డులు నిర్వహించి 2050 లీటర్ల కల్తీ పాలతో పాటు అందుకోసం ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇం దులో భాగంగానే ముగు రు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ ఐ శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ కు వచ్చిన సమాచారం మేరకు కేశేపల్లి, నార్పలల్లో దాడులు చేశామన్నా రు. కేశేపల్లిలోని పాలవిక్రయదారుడు రాజశేఖరరెడ్డి ఇంటిలో, నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న సాయి మిల్క్‌డైరీ, ఉయ్యాలకుంటలోని భూ షణ పాలకేంద్రంలోని కల్తీ పాలు, పె రుగును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కల్తీపాల తయారు కో సం వినియోగిస్తున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో పాటు మూడు మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పాల డైరీలలో తయారు చేస్తున్న కల్తీ పాలను అనంతపురం పట్టణంలో విక్రయిస్తున్నారని చెప్పారు. కల్తీపాలు త యారు చేసి విక్రయిస్తున్న సుబ్బరా యుడు, నాగభూషణ, రాజశేఖరరెడ్డిల ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారి రవిశంకర్ కల్తీపాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. -
యథేచ్ఛగా పాల కల్తీ!
తూప్రాన్: ప్యాకెట్ పాలైనా.. గేదె పాలైనా.. విష రసాయనాలు, ఎముకల పొడిమయమై పోయాయి. పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం పాలల్లో వాటికి బదులుగా ప్రజలను రోగాల బారిన పడేసే విషం ఉంటోంది. ఇదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజం.. జిల్లాలోని తూప్రాన్, కాళ్లకల్ మండల కేంద్రాలు పాల కల్తీకి అడ్డాగా మారాయి. పాల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. దీంతో వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని తూప్రాన్, కాళ్లకల్ గ్రామాలను అడ్డాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తూప్రాన్ డివిజన్లోని రైతుల వద్ద ఉన్న గేదెలు, ఆవులు సుమారు 5 వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇక్కడ నిత్యం సుమారు 50 వేల లీటర్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌కు చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, Ðవెల్దుర్తి, వర్గల్, చేగుంట మండలాలు, కాళ్లకల్‌కు మేడ్చెల్ జిల్లాలోని పూడూరు, రావన్‌కోల్, సోమారం, ఘనపూర్, మేడ్చెల్, లింగాపూర్, డబీల్‌పుర తదితర గ్రామాల వ్యాపారులు అక్కడ సేకరించిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రహస్యంగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. జిల్లాలో సరఫరా అవుతున్న పాలల్లో దాదాపు 80 శాతం కల్తీ జరుగుతున్నట్లు పలువురు పాల వ్యాపారులు చెబుతున్నారు. ఒక లీటరు స్వచ్ఛమైన పాలను ఎనిమిది లీటర్ల కల్తీ పాలుగా మార్చుతున్నారు. దీని కోసం మొదట లీటరు పాలల్లో అత్యధికంగా నీళ్లు కలుపుతారు. ఆ తర్వాత ఇందులో యూరియా, ఎముకల పొడి, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక కొందరు రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మోతాదుకు మించి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ ఇంజక్షన్లు రంగారెడ్డి జిల్లా మేడ్చల్, బోయిన్‌పల్లిలోని జనరల్ వెటర్నరీ, పశువుల దాణా దుకాణాల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం. గతంలోనే ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను నిషేధించింది. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధిక పాల ఉత్పత్తి కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్వ కోసం.. కల్తీ పాలను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం కోసం హైడ్రోజన్ ఫెరాక్సైడ్, సోడియం బై కార్పొనేట్, క్యాల్షియం యాక్సైడ్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. పాలు తెల్లగా ఉండేందుకు లీట రుకు రెండు గ్రాముల చొప్పున యూరియాను కలుపుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా సోయా, ఆముదం వాటి నుంచి వచ్చే నూనెలను కూడా కలుపుతున్నారు. అయితే అసలైన పాల వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారుల వల్ల నష్టాలకు గురవుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గేదెలను పెంచుతున్న రైతులు, వ్యాపారులు కల్తీ పాల పోటీకి తట్టుకోలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. కల్తీ పాలతో వచ్చే వ్యాధులు.. కల్తీ పాల వల్ల చిన్న పిల్లలతోపాటు పెద్దవారు కూడా అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ పాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. తూప్రాన్‌లో రెండేళ్ల క్రితం ఓ పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పాలల్లో కల్తీ గుట్టు రట్టు చేశారు. ఈ పాలల్లో యూరియా, నూనె, పౌడర్, తదితర రసాయనాలు గుర్తించి సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అయితే కొన్నాళ్లపాటు జాగ్రత్త పడిన వ్యాపారులు తిరిగి జోరుగా పాల కల్తీకి పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు అమ్మేవారు రోజూ నాణ్యమైనవి అమ్మడం లేదు. పలుచని పాలు అమ్ముతున్నారు. కనీసం పెరుగు కూడా తోడు కోవడం లేదు. కల్తీ పాలు అమ్ముతున్నారు. ఎక్కడ కొనాలో తెలియక నిత్యం సతమతమవుతున్నాం. నాణ్యమైన పాలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. –మహ్మద్ అసీఫ్, కల్తీ పాలతో ఇబ్బందులు తప్పడం లేదు వ్యాపారులు కల్తీ పాలను అమ్మడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తూప్రాన్‌లో కృత్రిమ పాల తయారుదారుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే తరహాలో పాలల్లో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తనిఖీ అధికారులు పాలల్లో కల్తీని గుర్తించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. –చెలిమెల జయరాములు, తూప్రాన్ -
పాల కల్తీపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల కల్తీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. పశు సంవర్థ్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ ఎండీ, స్టే ఫుడ్ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పాలు కాదు పచ్చి విషం ’శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన కె.నర్సింహారావు లేఖ రూపంలో హైకోర్టు ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలోని మెజారిటీ న్యాయ మూర్తులు సాక్షి కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేశారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించడంతో మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. -
పాల కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సందులో ఓ గదిలో ఎం.కె.మిల్క్ హౌస్ పేరుతో ఎలగందుల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ గత కొద్ది రోజులుగా పాల డిపో నడుపుతున్నాడు. ఎలాంటి పేర్లు, ముద్రణ లేకుండా పాలను ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని, అవి కల్తీ పాలు అని, పౌడర్స్ కలిపి తయారు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాటిపై దృష్టిపెట్టిన అధికారులు గురువారం ఉదయం పాల డిపోపై దాడి చేశారు. ఈ సందర్భంగా 200 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృతశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పాల కల్తీ చేస్తే యావజ్జీవం!
న్యూఢిల్లీ: పాలు, పాల ఉత్పత్తుల కల్తీపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీని నివారించేందుకు కఠిన చర్యలతో పాటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో సవరణలు చేయాలని, శిక్షార్హమైన నేరంగా మార్చాలని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు చేశాయని, పాల కల్తీకి పాల్పడితే జరిమానా, జరిమానా లేకుండా జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు చేశాయంటూ విచారణ సందర్భంగా కోర్టు ఉదహరించింది. -
పాల కల్తీ కేంద్రాలపై ఎస్వోటీ దాడులు
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాల తయారీ కేంద్రాలపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీల పేరుతో పాల కల్తీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 80 లీటర్ల పాలు, ఖాళీ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ పాల కేంద్రంపై అధికారుల దాడులు
-
క్షీరం.. కల్తీ మయం
జిల్లాలో పాలను కల్తీ చేసి విక్రయించడం పరిపాటిగా మారింది.. తాజాగా పాలు చిక్కగా ఉండేందుకు ఓ రకమైన పేస్టు కలుపుతూ మెదక్ పట్టణంలో ఓ పాల వ్యాపారి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన మలికె మల్లేశం కొంత కాలంగా మెదక్ పట్టణంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజులుగా పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తక్కువ ధరకే చిక్కని పాలు వేస్తానని చెప్పి అక్కడి మహిళలను నమ్మించాడు. కొంత మంది అతడి మాటలు నమ్మి పాలు తీసుకుంటున్నారు. కాని వాటని వేడి చేసిన తరువాత ముద్దగా మారడం.. ముట్టుకుంటే పెయింట్ అంటుకున్నట్లుగా ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా రెండు రోజులు గడిచినా అవి పాడు కాకపోవడంతో వారికి అనుమానం బలపడింది. ఆ పాలు తాగిన వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషయాన్ని కాలనీ వాసులు కౌన్సిలర్ సులోచన దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మంగళవారం పాలు తీసుకువచ్చిన మల్లేశంను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. తాను రోజు విక్రయించే స్వచ్ఛమైన పాలతో పాటు కొన్ని నీళ్లు కలిపి దానికి గోబిందా అనే కంపెనీకి చెందిన పేస్టును వాడుతున్నట్లు తెలిపారు. కాగా మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ సైతం సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఆరా తీయగా తనతో పాటు సిద్ధిరాములు, గంగారాంలు కూడా పేస్టు కలిపి పాలను విక్రయిస్తున్నారని మల్లేశం చెప్పాడు. దీని వెనుక ఇంక ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని మల్లేశంను స్థానిక పోలీసులకు అప్పగించారు. కల్తీ పాల ఘటన తెలుసుకున్న పుడ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ సంగారెడ్డి నుంచి మెదక్‌కు వచ్చి పాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలలో వైట్ పేస్టు కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిగతా విషయాలను తెలుసుకోవడానికి వాటిలో నుంచి 500 మి.లీ. పాలను తీసుకుని వాటిని హైదరాబాద్ సమీపంలోని నాచారం వద్ద గల పాల నిర్ధారణ కేంద్రానికి పంపనున్నట్లు వివరించారు. -
ఏమిటీ పాపాలు!
-
ఏమిటీ పాపాలు!
* హెరిటేజ్ పాల కల్తీ అంశంపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ * ప్రశ్నోత్తరాల సమయంలో పాల కల్తీ అంశంపై చర్చ * హెరిటేజ్ ప్రస్తావనతో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన * చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్ * ఆ సంస్థ పాలను నిషేధించాలన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు * పరస్పర నినాదాలతో సభ రెండుసార్లు వాయిదా * కల్తీపై కఠిన చర్యలు చేపడుతున్నామన్న రాజయ్య సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలలో కల్తీపై అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలతో తెలంగాణ శాసనసభ బుధవారం దద్దరిల్లింది. పరస్పర నినాదాలతో సభ మారుమోగింది. కల్తీకి పాల్పడుతున్న హెరిటేజ్ కంపెనీ పాలను నిషేధించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, దానిపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా హైదరాబాద్‌లో కల్తీ పాల సరఫరా అంశం ప్రస్తావనకు వచ్చింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులకు హానికరమైన ఇంజెక్షన్లు ఇస్తున్నారని పలువురు సభ్యులు మాట్లాడిన సందర్భంగా హెరిటేజ్ పాలలో కల్తీ విషయం చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు టీడీపీ సభ్యులు రాజేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పాలలో కల్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ కూడా కల్తీ పాలు అమ్ముతోందన్నారు. కేరళ ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించినట్లు పత్రికల్లో వచ్చిందని, దానిపై తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలపడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్పించుకున్నారు. అది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెందిన సంస్థ అని, దాన్ని నిషేధించాలో వద్దో టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీ వల్ల పిల్లలకు పాలు తాగించాలంటే భయం వే స్తోందన్నారు. పాల రూపంలో విషం తాగుతున్నామన్నారు. సామాజిక రుగ్మతగా మారిన పాల కల్తీపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కేరళలో హెరిటేజ్‌ను రద్దు చేశారన్నది ఎంత వర కు నిజమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ సంస్థ ఎన్ని పాల ను విక్రయిస్తోందని, ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం టి.రాజయ్య సమాధానమిస్తూ.. హెరిటేజ్ సంస్థ కల్తీ పాల విక్రయం, కేరళలో నిషేధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని, జిల్లాల్లోనూ అధికారులను నియమించామని చెప్పారు. మం త్రి మాట్లాడుతుండగానే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తది తరులు పట్టుబట్టారు. అవకాశం ఇవ్వకపోవడం తో నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హెరిటేజ్ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. పాలల్లో కల్తీపై ప్రశ ్న వేసిందీ, చర్చనుప్రారంభించిందీ టీడీపీ సభ్యులేనన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు ప్రస్తావిస్తే ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నిం చారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో.. ‘ఇక్కడ హెరిటేజ్ సంస్థ డెరైక్టర్, ప్రతినిధులు లేరు.. మీరు మాత్రం వారిలాగే వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి నామినేట్ అయినవారిలా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత తొత్తులుగా వ్యవహరించడం తెలంగాణ ప్రజల దురదృష్టం. మీరు ఆ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడటం దారుణం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో పాల కల్తీని తేల్చేందుకు ‘ఐపీఎం’ను రెఫరల్ ల్యాబ్‌గా గుర్తించామన్నారు. 32 పాల నమూనాలను సేకరించగా 11 నమూనాల్లో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. పంజాగుట్టలో సేకరించిన హెరిటేజ్ టోన్డ్ మిల్క్ శాంపిల్‌లో డిటర్జెంట్ కలిపినట్లు తేలిందన్నారు. దీంతో టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించినా టీడీపీ సభ్యులు నినాదాలను కొనసాగించడంతో సభను మళ్లీ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
పాల కల్తీ యావజ్జీవ శిక్షార్హ నేరం: సుప్రీం
న్యూఢిల్లీ: పాలకల్తీని యావజ్జీవ శిక్షార్హ నేరంగా మార్చాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మానవ వినియోగానికి హానికరమైన రీతిలో కల్తీపాల ఉత్పత్తి, విక్రయాలు చేయడాన్ని యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చేందుకు చట్టాల్లో తగిన సవరణలు తీసుకురావాలని కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే కల్తీపాల విక్రయాలను యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈమేరకు సిఫారసు చేసింది. -
పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం
కల్తీ పాలు ఉత్పత్తికి, మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. అక్రమంగా పాలను కల్తీ చేసే వారిని శిక్షించడానికి చట్టాలను మార్చాలని సుప్రీం సూచించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సింథటిక్ మెటిరియల్ తో పాలను కల్తీ చేస్తున్నారనే అంశంపై కేఎస్ రాధాకృష్ణన్, ఎకే సిక్రిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించారు. పాలను కల్తీ చేసే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని సుప్రీం ఆదేశించింది. హాని కలిగించే విధంగా పాల ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన చట్టాలను పటిష్టం చేయాలని సూచనలు చేసింది. అంతేకాక అలాంటి అక్రమాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద కనీసం ఆరు నెలల శిక్ష విధించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల కల్తీ జరుగుతోందంటూ ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ శాంపిల్స్ ను సేకరించి 2011లో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం తీవ్రంగా స్పందించింది.


