కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్ | Police bust gang involved in milk adulteration | Sakshi
Sakshi News home page

కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్

Jan 18 2016 3:23 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement