పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం | Make milk adulteration punishable with life imprisonment: Supreme Court | Sakshi
Sakshi News home page

పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం

Dec 5 2013 2:55 PM | Updated on Sep 2 2018 5:20 PM

పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం - Sakshi

పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం

కల్తీ పాలు ఉత్పత్తికి, మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది

కల్తీ పాలు ఉత్పత్తికి, మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. అక్రమంగా పాలను కల్తీ చేసే వారిని శిక్షించడానికి చట్టాలను మార్చాలని సుప్రీం సూచించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సింథటిక్ మెటిరియల్ తో పాలను కల్తీ చేస్తున్నారనే అంశంపై కేఎస్ రాధాకృష్ణన్, ఎకే సిక్రిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించారు. పాలను కల్తీ చేసే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని సుప్రీం ఆదేశించింది. 
 
హాని కలిగించే విధంగా పాల ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన చట్టాలను పటిష్టం చేయాలని సూచనలు చేసింది. అంతేకాక అలాంటి అక్రమాలకు  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద కనీసం ఆరు నెలల శిక్ష విధించాలని ఆదేశించింది. 
 
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల కల్తీ జరుగుతోందంటూ ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ శాంపిల్స్ ను సేకరించి 2011లో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం తీవ్రంగా స్పందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement