Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ys Jagan Emotional Tweet On People Affection
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం… pic.twitter.com/lVcgXOuo8N— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్‌ జగన్‌కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్‌ఆర్‌కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్‌ కాన్వాయ్‌ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్‌ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్‌ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్‌ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్‌ కాలనీ మీదుగా రషీద్‌ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్‌ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మహిళలు జగన్‌ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్‌ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.

Crowdstrike may lose 6 billion fifth of its value amid global IT outage
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం.. రూ.1.34 లక్షల కోట్ల నష్టం!

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్‌ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్, సర్వీసెస్‌ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్‌ దాడి కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తప్పుడు అప్‌డేట్‌ను రన్‌ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్‌’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్‌ సీఈఓ జార్జ్‌ కుర్జ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

Kethireddy Pedda Reddy Who Went To Tadipatri Police Station
తాడిపత్రిలో హై టెన్షన్‌

సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బెయిల్‌ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్‌ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.

Japan Spreading New Covid 19 Corona Variant KP 3
మరో కరోనా వేవ్‌.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్‌ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్‌ ఇప్పుడు జపాన్‌ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ ​కొత్త వేరియంట్‌ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్‌ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది.

Harbhajan Singh lashes out at Pakistani fan for comparing MS Dhoni And Rizwan
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్‌: భజ్జీ ఫైర్‌

భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జ‌ర్నలిస్ట్‌కు అద‌రి పోయే కౌంట‌రిచ్చాడు. భార‌త మాజీ కెప్టెన్‌, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెట‌ర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు స‌దరు జ‌ర్న‌లిస్ట్‌పై హర్భజన్ మండిప‌డ్డాడు.ఫ‌రీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్‌ జ‌ర్న‌లిస్ట్ ఎంఎస్ ధోని, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ల‌లో ఎవ‌రు బెట‌ర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భ‌జ్జీ ఇదేమి చెత్త ప్రశ్న‌ అంటూ ఫైర‌య్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భ‌య్యా అత‌డికి ఎవ‌రైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విష‌యం రిజ్వాన్‌ను అడిగినా అత‌డు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అత‌డు జ‌ట్టు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్‌లో ఇప్ప‌టికీ ధోనినే నంబర్ వ‌న్‌. వికెట్ల వెన‌క ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భ‌జ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్‌లో ధోని కంటూ ఒక ప్ర‌త్యేక‌స్ధాన‌ముంది.భార‌త్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అత‌డి సార‌థ్యంలోనే 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024

BRS leader Kavita health deteriorated
క్షీణించిన కవిత ఆరోగ్యం!

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్‌ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్‌ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది. పదికిలోల బరువు తగ్గిన కవిత భర్త అనిల్‌ సమక్షంలో కవితకు ఎయిమ్స్‌ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్‌ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌ అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్‌ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్‌ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు.

Jagan consoles Rashids family
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది.. రాష్ట్రపతి పాలన విధించాలి

గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం అవసరమా? – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏ సామాన్యుడిని కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తం అవుతోంది. టీడీపీ నాయకులు ఎవరినైనా కొట్టొచ్చు.. ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయొచ్చు.. హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడొచ్చనే రీతిలో పాలన నడుస్తోంది. అరాచకాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసి అన్ని ఆధారాలను నివేదిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కచ్చితంగా తమ పార్టీ నిరసన గళాన్ని వినిపిస్తుందన్నారు. 24వ తేదీన (బుధవారం) తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు యావత్తు దేశానికి తెలిసేలా ఢిల్లీలో ధర్నా చేపడతామని స్పష్టం చేశా­రు. రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్‌మెంట్‌ కోరామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఉభయ సభల వేదికగా గవర్నర్‌ ప్రసంగం సమయంలో ఆటవిక పాలనపై ప్రశ్నిస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేయకుండా దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల ప్రేక్షకపాత్ర..రాష్ట్రంలో దారుణమైన ఆటవిక చర్యలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చివరికి టీడీపీ నాయకుల దాడుల్లో బాధితులైన వ్యక్తులు పోలీసుల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటుంటే తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి దాపురించింది. ఇలాంటి నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతుండటం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్‌ దారుణ హత్య పెద్ద ఉదాహరణ. గతంలో పల్నాడు జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి రవిశంకర్‌ ఎస్పీగా ఉంటే తెలుగుదేశం నాయకులు తమ పలుకుబడితో ఆయన్ను తప్పించేశారు. అనంతరం వారికి అనుకూలంగా పని చేసే బిందుమాధవ్‌ను ఎస్పీగా తెచ్చుకుని అరాచక పర్వానికి తెరలేపారు. బిందు మాధవ్‌ ఎన్నికల సమయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఎన్నికల కమిషన్‌ స్వయంగా సస్పెండ్‌ చేసింది. తర్వాత మరో మంచి అధికారి మలికా గార్గ్‌ను ఈసీ నియమిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను సైతం పంపించేశారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు సహాయ సహకారాలు అందించరనే కారణంతో మలికా గార్గ్‌ను తప్పించారు. ఇప్పుడు టీడీపీకే మద్దతు పలికే శ్రీనివాస్‌ అనే వ్యక్తికి పల్నాడు ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగానే కత్తులతో నరికి రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించేందుకే అమాయకుడు, సాధారణ ఉద్యోగి అయిన రషీద్‌ను క్రూరంగా హత్య చేయడం దుర్మార్గం. మీడియా ముసుగులో దిగజారుడుతనం రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ టీడీపీకే కొమ్ముకాస్తోంది. వీరితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు మీడియా ముసుగులో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. రషీద్‌ హత్య ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దు్రష్పచారానికి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. జిలానీకి చెందిన మోటార్‌ బైక్‌కు వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులు నిప్పుపెట్టడంతోనే ఇప్పుడు ఈ హత్యకు పాల్పడినట్టు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు.వాస్తవానికి మోటార్‌ బైక్‌ జిలానీది కాదు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆసిఫ్‌ అనే వ్యక్తిది. ఆ బైక్‌ను టీడీపీకి చెందిన మాజీ చైర్మన్‌ షామీమ్, టీడీపీ స్టేట్‌ సెక్రటరీ ఆయూబ్‌ ఖాన్, మరికొంత మంది టీడీపీ నాయకులు తగలబెట్టి, ఆసిఫ్‌ను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 17నే పోలీసులు కేసు నమోదు చేశారు.10/2024తో క్రైమ్‌ నంబర్‌ కూడా నమోదైంది. అయితే ఇదంతా జరగలేదన్నట్టు ఎల్లో మీడియా సృష్టించి, పోలీసులు కేసు కూడా పెట్టలేదని చెబుతోంది. వాస్తవాలను వక్రీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ ఘటన జరిగిన గంటల్లోనే బయటకు వచ్చి వ్యక్తిగత కక్షలతో జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతున్నారు.ఈ సంబంధాలేంటి?రషీద్‌ హత్యపై పోలీసులు కేసు పెట్టామని అంటున్నారు. ఈ కేసు జిలాని అనే వ్యక్తి మీద మాత్రమే పెట్టారు. జిలానీకి.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో ఫొటోలు దిగాడు. ఆయన భార్యకు కేక్‌లు తినిపించాడు. ఆ పార్టీ నాయకులు షమీమ్‌ ఖాన్‌తో సన్నిహిత సంబంధా­లు­న్నాయి. ఈ క్రమంలో వారందరి పేర్లు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో లేవు? ఇదేంటి మరి? (ఫొటో చూపుతూ) ఇందులో జిలానీ స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యే భార్యకు కేక్‌ తినిపిస్తున్నాడు. లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేయడం.. ఆ కేక్‌ను ఈ జిలానీ స్వయంగా ఎమ్మెల్యే భార్యకు తినిపించడం కళ్లెదుటే కనిపిస్తోంది. అంటే వీళ్ల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? (ఎమ్మెల్యేతో, ఆయూబ్‌ఖాన్, షమీమ్‌ఖాన్‌తో జిలానీ దిగిన ఫొటోలు చూపారు) మరి వీళ్లెవరూ కేసులో ఎందుకు లేరు? వారిపై కేసు ఎందు­కు నమోదు చేయలేదు? ఇంతకన్నా అన్యా­యం ఏమైనా ఉంటుందా? రషీద్‌ను ఫ్యాక్షన్‌ మూలాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం దారుణం. ఆ కుటుంబం ఏం పాపం చేసిందని ఒక మనిíÙని చంపారు? అంతటి­తో ఆ­గ­కుండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తు­న్నారు. హత్యకు గురైన వ్యక్తులకు సా­ను­భూతి తెలపకుండా తప్పుడు ప్రచారం చే­యడం దారుణం. చంద్రబాబు క్షమాపణ చె­ప్పాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వీడాలి. ఇ­లాంటి ఘటనలు పునరావృతం అవ్వవు అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. ఎంపీలను తిరగనివ్వట్లేదు ఎంపీ మిథున్‌ రెడ్డి తన పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పుంగనూరులో తిరగకూడదా? మా మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళితే.. ఆ ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి, రెడ్డెప్ప కారుకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. ఇంతకన్నా శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబే పట్టించుకోవద్దని చెప్పడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ రోజు టీడీపీ వాళ్లను కొట్టండి, చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏ అక్కచెల్లెమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఏదైనా ఆపద వస్తే మొబైల్‌ ఫోన్‌లో ‘దిశ’ యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే రక్షించే వ్యవస్థను తెచ్చాం.

Microsoft Outage Effected America Air Traffic Severly
మైక్రోసాఫ్ట్‌ బగ్‌ ఎఫెక్ట్‌.. ఖాళీగా అమెరికా గగనతలం

న్యూయార్క్‌: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్‌ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో బగ్‌ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలైన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌,డెల్టా,యునైటెడ్‌ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్‌ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్‌ వీడియోను ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విమానాల ట్రాఫిక్‌ టైమ్‌లాప్స్‌ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024

Tripti Dimri Bad Newz Movie Review And Rating Telugu
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?

'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్‌గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్‌టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష‍్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్‌కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్‌కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లే‌తోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్‌లో ప్రధాన పాత్రధారులు ఇ‍ద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్‌టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ)

Mother Cultivation of Dragon Fruit
కూతురి కోసం పంటనే పండించింది

తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతు రేణుక కథ ఇది.‘మీ అమ్మాయికి ప్లేట్‌లెట్స్‌ బాగా పడిపోయాయి. ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి డ్రాగన్‌ ఫ్రూట్‌ తినిపించమ్మా’ అని డాక్టర్‌ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్‌ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్‌ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్‌లెట్స్‌ పెర గడానికి డ్రాగన్‌ ఫ్రూట్‌ తినిపించమని చె΄్పారు. దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్‌ ఫ్రూట్‌ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్‌ మార్కెట్‌లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.మనం ఎందుకు పండించకూడదు?రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్‌ ఫ్రూట్‌’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు. ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్‌ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.43 పండ్లు దక్కాయిపంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.– ఎస్‌.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all