breaking news
Khyber Pakhtunkhwa province
-
పాక్‌లో 62 మంది మిలిటెంట్లు హతం
పెషావర్: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన రెండు జిల్లాల్లో 36 గంటల పాటు సాగిన నిఘా ఆధారిత వరుస ఆపరేషన్లలో 62 మంది మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. బన్ను జిల్లాలో 10 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో చేపట్టిన ఇతర ఆపరేషన్లలో నలుగురు కీలక కమాండర్లతో సహా 52 మంది మృతిచెందారు. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ‘ఫిట్నా అల్–ఖవారిజ్’మిలిటెంట్లపై లక్షిత దాడులు నిర్వహించడానికి ముందు భద్రతా దళాలు అనుమానిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేశాయి. ఫిట్నా అల్–ఖవారిజ్ అనేది నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) కోసం ప్రభుత్వం ఉపయోగించే పదం. చెట్ల పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించడానికి క్వాడ్కాప్టర్లను ఉపయోగించారని, దీనివల్ల భద్రతా దళాలు వారిని కచి్చతంగా లక్ష్యంగా చేసుకోగలిగాయని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫిట్నా అల్–ఖవారిజ్కు చెందిన నలుగురు కీలక కమాండర్లు సైతం ఉన్నట్లు తెలిపారు. -
బాంబర్ బీభత్సం.. షాకింగ్ విజువల్స్ వైరల్!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.పోలీసులే టార్గెట్.. శాంతి ర్యాలీపై పంజాస్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇక్కడే ఎందుకు దాడులు?పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.TTP మళ్లీ పుంజుకుంటోందా?తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యం పాకిస్థాన్‌లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లోని కొన్ని మిలిటెంట్ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై దాడులు జరగడం లేదని చెబుతోంది.శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?పాక్‌కు పెరుగుతున్న భద్రతా సవాల్ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.BREAKING: A suicide blast struck Kabal Police Station in Swat district, Khyber Pakhtunkhwa, Pakistan, during a nearby peace rally. Reports indicate at least 16 people, including 10 police officers, were killed, with many others injured.#BreakingNews #Pakistan #Swat…— WorldNewsRank (@WNewsRankX) August 3, 2026 -
పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్‌స్టేషన్ సమీపానికి రాగానే ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఐదుగురు పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాలపాలైన మరో 15 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్ స్వాత్ అమన్ జిర్గా సారథ్యంలోని జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని ప్రధాన గేట్ వద్ద పోలీసులు అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. -
పాకిస్తాన్లో ఫ్రెంచ్ మహిళకు విముక్తి
ఇస్లామాబాద్: ఏళ్ల తరబడి పాకిస్తాన్లో బందీగా ఉన్న ఓ ఫ్రెంచ్ మహిళ, ఆమె ఐదుగురు పిల్లలకు విముక్తి లభించింది. పిల్లల్లో ఒకరైన టీనేజ్ కుమారుడు ఇంటి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జూన్ 18న వారిని దాచిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అత్యంత శిథిలావస్థలో ఉన్న గది నుంచి 54 ఏళ్ల సిల్వీ యాస్మినా, ఆమె పిల్లలను రక్షించారు. వారిని పెషావర్‌లోని ఆశ్రయానికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబం ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లాలని న్నట్లు పోలీసులు తర్వాత ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. వారి శరీరాలపై గాయాలు, దెబ్బల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బారా పర్వత ప్రాంతంలో ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ్రస్టేలియాలో అక్రమంగా నివస్తున్నాడు. ఆ సమయంలో సిల్వీతో పరిచయం ఏర్పడింది. 2003లో వారిద్దరి వివాహం జరిగింది. 2014లో ఆ్రస్టేలియా నుంచి పాకిస్తాన్‌కు వచ్చారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు. పాకిస్తాన్‌కు వచ్చిన తరువాత మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే పాకిస్తాన్‌కు వచ్చినప్పటినుంచే పరిస్థితులు మారిపోయాయయి. మహిళను ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. ఆ ఇద్దరు పెద్ద పిల్లలు చదువు మాన్పించేశారు. అంతేకాదు.. పాకిస్తాన్లో పుట్టిన ముగ్గురు పిల్లలయితే పాఠశాల ముఖమే చూడలేదు. భర్త తనను, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సిల్వీ తెలిపారు. ‘‘12 ఏళ్లపాటు మా స్వేచ్ఛను హరించాడు. మమ్మల్ని రోజూ కొట్టేవాడు. నన్ను, నా పిల్లలను ఇతర వ్యక్తులతో కలవకుండా అడ్డుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. నా భవిష్యత్తు అప్పటికే నాశనమైపోయింది. నా పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందని భయపడ్డాను.’’అని ఆమె పోలీసులకు చెప్పారు. -
పాకిస్తాన్లో హై అలర్ట్.. ఆత్మాహుతి దాడిలో కీలక నేత మృతి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు దాడిలో పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్‌లో ఉన్నారని సమాచారం. దీంతో, పాకిస్తాన్‌లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఖురేషి మోర్ సమీపంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుడు కారణంగా పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. మృతుల్లో శాంతి కమిటీ కమాండర్ జాగ్రీ మెహసూద్ కూడా ఉన్నారు. కాగా, దాడి జరిగిన సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నృత్యం చేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా గది పైకప్పు కూలిపోయింది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.#BREAKING𝐃𝐞𝐫𝐚 𝐈𝐬𝐦𝐚𝐢𝐥 𝐊𝐡𝐚𝐧 𝐒𝐮𝐢𝐜𝐢𝐝𝐞 𝐁𝐥𝐚𝐬𝐭 𝐊𝐢𝐥𝐥𝐬 𝐎𝐯𝐞𝐫 𝐓𝐞𝐧, 𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐏𝐞𝐚𝐜𝐞 𝐂𝐨𝐦𝐦𝐢𝐭𝐭𝐞𝐞 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬A suicide bombing struck a wedding ceremony in the Qureshi Mor area of Dera Ismail Khan district, Khyber Pakhtunkhwa, on… pic.twitter.com/KKvtYRi1rx— نقطةNUQTA (@NUQTA31) January 23, 2026అనంతరం, ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ మాట్లాడుతూ.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏడు అంబులెన్స్‌లు, ఒక అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్‌లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి ఇప్పటివరకు ఏ టెర్రరిస్టు బాధ్యత వహించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. -
పాక్‌లో వర్ష విలయం
పెషావర్/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి. గత 36 గంటల వ్యవధిలో 214 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఆకస్మిక వర్షాలు, వరదల్లో అత్యధికంగా 198 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది మహిళలు, 12 మంది చినానరులు ఉన్నారన్నారు. పీవోకేలోని గిల్గిట్–బాల్టిస్తాన్, కారకోరమ్ హైవే దెబ్బతిన్నాయన్నారు. ఖైబర్ ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో అత్యధికంగా 92 మంది చనిపోగా మన్òÙరా జిల్లాలో 17 మంది బజౌర్, బటగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. లోయర్ దిర్ జిల్లాలో ఐదుగురు, స్వాత్‌లో నలుగురు, సంగ్లాలో ఒకరు చనిపోయారు. పలువురు చిన్నారులు సహా మొత్తం 125 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. సహాయ, అన్వేషణ కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వివరించింది. స్వాత్, బజౌర్లలో ఆర్మీ సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఆకస్మిక వరదల్లో గిల్గిట్–బల్టిస్తాన్లోని ఘిజర్ జిల్లాలో 8 మంది చనిపోగా ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో పలు నివాసాలు, వాహనాలు, స్కూలు భవనాలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరమ్ హైవే, బల్టిస్తాన్ హైవే పలు చోట్ల దెబ్బతింది. లింకు రోడ్లు తెగిపోవడంతో నీలమ్ లోయలోని రట్టి గలి సరస్సు వద్ద చిక్కుకుపోయిన 600 మందికి పైగా పర్యాటకులను అక్కడే ఉండాలంటూ అధికారులు సూచనలు చేశారు. కుందల్ షాహి వద్ద వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఒక రెస్టారెంట్‌తో పాటు మూడిళ్లు నేలమట్టమయ్యాయి. జీలమ్ నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. పీవోకేలోని ముజఫరాబాద్ జిల్లాలోని సర్లి సచాలో ఇల్లు కూలి కుటుంబంలోని ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. సు«ద్నోటి, బాగ్ జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.కూలిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ శుక్రవారం ఖైబర్ ప్రావిన్స్‌లో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా ఐదుగురు చనిపోయారని చెప్పారు. వాతావరణం ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణమని భావిస్తున్నామన్నారు. పెషావర్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎంఐ–17 హెలికాప్టర్ మహ్మంద్ జిల్లాలోని చంగి బండా వద్ద కూలిందని వివరించారు. ఘటన నేపథ్యంలో మరో హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామన్నారు. -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
పాకిస్తాన్లో మత సదస్సులో ఆత్మాహుతి దాడి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ఘోరం జరిగింది. నౌషేరా జిల్లా అకోరా ఖట్టక్ పట్టణంలో మతపరమైన సదస్సులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయ పడ్డారు. శుక్రవారం సదస్సులో జుమ్మా ప్రార్థనలు జరుగుతుండగా ఓ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో జమీయత్ ఉలేమా ఇస్లామ్ (జేయూఐ) అధినేత, మదర్సా– ఇ–హకానియా మసీదు నిర్వాహకుడు హమీదుల్ హక్ హక్కానీతోపాటు మరో నలుగురు అక్కడి కక్కడే మృతిచెందారు. హక్కానీ లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని స్థానిక ఐజీ జుల్ఫీకర్ హమీద్ చెప్పారు. 1968లో జన్మించిన హక్కానీ తన తండ్రి మౌలానా సమీ ఉల్ హక్ మరణం తర్వాత జేయూఐ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. మతపెద్దగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాణాపాయం ఉండడంతో పోలీసులు ఆయనకు ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆత్మాహుతి దాడిలో హక్కానీ మర ణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ త్మాహుతి దాడికి ఎవరు కారకులన్నది ఇంకా తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్‌పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్‌లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్‌ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. -
ఒకే వేదికపై ముఖ్యమంత్రి, ఉగ్రవాది
న్యూఢిల్లీ: ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పాకిస్థాన్ రాజకీయ నాయకుల తీరు మారడం లేదు. బాహాటంగా పాక్ నాయకులు ఉగ్ర మూకలతో అంటకాగుతున్నారు. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టక్ లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కీతో వేదిక పంచుకోవడం గమనార్హం. ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన పర్వేజ్ ఖట్టక్ ఆదివారం పెషావర్‌లో జరిగిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మక్కీ కూడా ఉన్నారు. మక్కీ బావ, ముంబై దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయీద్. మక్కీ కూడా ఉగ్రవాద కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ సమావేశంలో సయీద్ పాల్గొనకుండా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరుడుగట్టిన మతవాద గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు సీఎం పర్వేజ్ ఖట్టక్ ఈ భేటీలో పాల్గొన్నట్టు స్థానిక డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్‌ను పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఖట్టక్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 40కిపైగా ఇస్లామిక్ అతివాద రాజకీయ పార్టీలతో కూడిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ దేశంలో సంప్రదాయ విధానాలను పాటించాలని ప్రవచిస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ తరచూగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. -
శరణార్థులపై పాకిస్థాన్ పైశాచికం
-
పాకిస్థాన్ పైశాచికం
పెషావర్: ఎవరి పేరు మీద కోటానుకోట్ల డాలర్లు ఉపకారాన్ని పొందుతుందో.. ఎవరిని ఆదుకుంటున్నామని చెప్పుకుంటూ అంతర్జాతీయ సమాజం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుందో.. అలాంటి పాస్తున్(అఫ్ఘాన్) శరణార్థుల పట్ల పాకిస్థాన్ ఘోర పైశాచికాన్ని ప్రదర్శిస్తోంది. 'అఫ్ఘాన్ శరణార్థులకు మేము ఆశ్రయం కల్పిస్తున్నాం.. పాకిస్థాన్ శాంతికాముక దేశం అనడానికి ఇదే నిదర్శనం. వాళ్లను ఆదుకోవడానికి మరింత డబ్బు సాయం చేయండి' అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది రోజుల కిందట ఐక్యరాజ్యసమితిలో గొప్పలు చెప్పుకున్నదానికి భిన్నంగా.. 50 లక్షల మంది పాస్తున్ శరణార్థులపై పాక్ సైన్యం, వైమానిక దళాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ దేశం విడిచి పోరాపోయేలా చేస్తున్నాయి. గడిచిన పాతికేళ్లుగా పాక్ నేలతో మమేకమైన పాస్తున్ లు గడిచిన వారం రోజులుగా కట్టుబట్టలతో అఫ్ఘాన్ లోని సొంత ప్రాంతం బటి కోట్ కు పారిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అటు బటి కోట్ (తూర్పు అఫ్ఘాన్ లోని నంగార్హర్ ప్రావిన్స్)లోనూ పరిస్థితులు ప్రమాదకంగా ఉన్నాయి. అక్కడ ఐసిస్, అఫ్ఘాన్ సన్యాలకు పెద్ద యుద్ధమే నడుస్తోంది. అయినాసరే పాకిస్థాన్ వాళ్లను తరుముతూనేఉంది. శరణార్థులపై దాడులు కొత్త కానప్పటికీ భారత్-అఫ్ఘానిస్థాన్ ల మైత్రి బలపడుతుండటంతో ఇటీవల పాక్ వికృతాలు పరాకాష్టకు చేరాయి. ఈ వలసకు సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. 2014, డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్‌పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. వాళ్లను సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్న పాక్ బలగాలు.. శరణార్థులపై తీవ్ర హింసను ప్రయోగిస్తున్నాయి. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో దాదాపు 50 లక్షల మంది అఫ్ఘన్ శరణార్థులు గడిచిన 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. 1980ల్లో అమెరికా- రష్యాల ఆధిపత్యపోరులో భాగంగా జరిగిన యుద్ధం సమయంలో, 9/11 సంఘటన తర్వాత అఫ్ఘాన్ పై అమెరికా దాడుల సమయంలో వీరంతా పాకిస్థాన్ కు వలవవచ్చారు. అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పాక్ సైన్యాలు వదలడం లేదు. పాస్తున్ లు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం పాక్ బలగాలకు అలవాటైనపని. పెషావర్ సైనిక స్కూల్ పై దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోగా ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకు పెరిగింది. -
ప్రయాణికులే లక్ష్యంగా పేలుడు : 15 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కైబర్ పక్తున్వ ప్రావిన్స్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. పెషావర్ సునేరి మసీదు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత మంది పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పేలుడు జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిందని తెలిపింది. మర్దన్ నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ఈ బస్సులోని ప్రయాణికులే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని మీడియా వెల్లడించింది. ఈ పేలుడుకి తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఎవరూ సంస్థ ప్రకటించలేదని చెప్పింది. మృతులంతా సచివాలయంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మీడియా వివరించింది. -
శరణార్థులపై పోలీసుల దాడులు..
ఉగ్రవాదం- అగ్రవాదాల ఆధిపత్యపోరులో అమాయక పౌరులు సమిధలవుతున్నారు. నాటి అఫ్ఘాన్ యుద్ధం, నిన్నటి ఇరాక్ యుద్ధం నేటి సిరియా యుద్ధాల్లో సూత్రధారులు, పాత్రధారులు ఎంతమంది చచ్చారోగానీ సాధారణ పౌరులు మాత్రం లక్షల మంది హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. సరే, ఎలాగోలా బతికేద్దామని పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళితే అక్కడ కూడా వారిని పీక్కుతినే రాబందులు తయారయ్యాయి. ఇప్పటికైతే యూరప్ నుంచి సిరియా శరణార్థుల తిరుగు ప్రయాణాలు మొదలు కాలేదుగానీ పారిస్ దాడుల అనంతరం ఆ పరిణామం కచ్చితంగా తలెత్తుతుంది. అందుకు ఉదాహరణే పాకిస్థాన్‌లో అప్ఘనిస్థాన్ శరణార్థుల గోస. గత డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్‌పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. అధికారికంగా వెల్లడించనప్పటికీ అఫ్ఘాన్లను తమ సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్నారు పాకిస్థాన్ పోలీసులు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యూ) సంస్థ తాజాగా వెలువరించిన నివేదిక.. పాక్‌లో అఫ్ఘాన్ శరణార్థులపై సాగుతున్న హింసను మరోసారి ప్రపంచం ముందుంచింది. ప్రధానంగా ఈశాన్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో తలదాచుకున్న అఫ్ఘన్ శరణార్థులపై ఆ రాష్ట్ర పోలీసులు పాశవిక దాడులు చేస్తున్నారని హెచ్ ఆర్ డబ్ల్యూ పేర్కొంది. అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ ప్రావిన్స్‌కు గడిచిన 30 ఏళ్ల నుంచీ శరణార్థుల రాక కొనసాగుతూనే ఉంది. అఫ్ఘానిస్థాన్ పై అమెరికా యుద్ధం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు పాక్‌లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థుల సంఖ్య 50 లక్షలకు తక్కువ ఉండదని అంచనా. నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా.. శరణార్థులపై కనికరం చూపకున్నప్పటికీ వారిపై హింస జరిగేదికాదని, 2014, డిసెంబర్ 26 నాటి పెషావర్ సైనిక స్కూల్ దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని హక్కుల సంస్థ తెలిపింది. అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పోలీసులు వదలడం లేదని, వారు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం వంటి పాశవిక చర్యలు.. పెషావర్ దాడి తర్వాత స్వసాధారణమైపోయాయి. దీంతో పాక్ లో బతకలేక తిరిగి అఫ్థాన్ వెళ్లిపోతున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెషావర్ దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే విషయంపై ఖైబర్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ మోయిన్ సయీద్ మాట్లాడుతూ 'అఫ్ఘాన్ శరణార్థుల నుంచి లంచాలు గుంజుతున్నారనే ఫిర్యాదులు నిజమే. వాటికి సంబంధించి కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేశాం. మరికొందరిని డిస్మిస్ కూడా చేశాం' అని చెప్పుకొచ్చారు. శరణార్థులకు రక్షణ కల్పించడం తమ కనీస బాధ్యతని, లోపాలను సరిదిద్దుకుంటామని ఖైబర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముస్తాఖ్ ఘనీ మీడియాకు వివరించారు. ఖైబర్ ప్రావిన్స్ లో పోలీసులు ధ్వంసం చేసిన అఫ్ఘాన్ శరణార్థుల ఇళ్లు.. పాక్ లో బతకలేక అఫ్ఘాన్ పయనమైన శరణార్థి కుటుంబం.. మూటాముల్లె సర్దుకుని సొంతదేశానికి వెళ్లే ప్రయత్నంలో అఫ్ఘాన్ శరణార్థి మహిళలు -
పెషావర్‌లో ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి
వాయవ్య పాకిస్థాన్ ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆత్మహుతి జరిపిన దాడిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ శివారులోని సరబండ్లోని భట్టా తాల్ మార్కెట్ వద్ద ఆ దాడి జరిగింది. దీంతో మృత్యుల సంఖ్య పెరిగింది. మృతులలో ముగ్గురు పోలీసులతోపాటు మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను ఖైబర్ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆత్మాహుతి దాడితో మార్కెట్ పరిసర ప్రాంతాలు రక్తసిక్తంగా మారాయని, ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటు ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
పాక్‌లో బాంబు పేలుడు: ముగ్గురు సైనికులు మృతి
ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్లోని బన్ను జిల్లాలోని మిర్జాలీ చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం బాంబు పేలుడు సంభవించి ముగ్గురు సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆర్మీ వైద్య శిబిరానికి తీసుకువెళ్లారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం బన్ను నగరంలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సైనికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భద్రత దళాల కాన్వాయ్ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు. అయితే ఆ పేలుడుకు తామే బాధ్యలమని ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించ లేదు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
బస్సులో బాంబు పేలుడు: 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్ చరసద్దా రహదారిపై శుక్రవారం ఓ బస్సులో బాంబు పేలి 12 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని లేడి రిడీంగ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని అన్నారు. ఆ ప్రావెన్స్లోని సివిల్ సెక్రటేరియట్లో విధులు ముగించిన అనంతరం ఉద్యోగులు బస్సులో ఇంటి వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఆ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.


