పెషావర్లో ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి | 7 killed in Peshawar suicide blast | Sakshi
Sakshi News home page

పెషావర్లో ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి

Mar 14 2014 2:57 PM | Updated on Sep 2 2017 4:42 AM

వాయవ్య పాకిస్థాన్ ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆత్మహుతి జరిపిన దాడిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

వాయవ్య పాకిస్థాన్ ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆత్మహుతి జరిపిన దాడిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ శివారులోని సరబండ్లోని భట్టా తాల్ మార్కెట్ వద్ద ఆ దాడి జరిగింది. దీంతో మృత్యుల సంఖ్య పెరిగింది. మృతులలో ముగ్గురు పోలీసులతోపాటు మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను ఖైబర్ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఆత్మాహుతి దాడితో మార్కెట్ పరిసర ప్రాంతాలు రక్తసిక్తంగా మారాయని, ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటు ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement