పాక్లో బాంబు పేలుడు: ముగ్గురు సైనికులు మృతి | Three soldiers killed in Pakistan bombing | Sakshi
Sakshi News home page

పాక్లో బాంబు పేలుడు: ముగ్గురు సైనికులు మృతి

Oct 6 2013 12:03 PM | Updated on Mar 23 2019 8:09 PM

ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్లోని బన్ను జిల్లాలోని మిర్జాలీ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం బాంబు పేలుడు సంభవించి ముగ్గురు సైనికులు మరణించారు.

ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్లోని బన్ను జిల్లాలోని మిర్జాలీ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం బాంబు పేలుడు సంభవించి ముగ్గురు సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆర్మీ వైద్య శిబిరానికి తీసుకువెళ్లారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం బన్ను నగరంలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు.

 

గాయపడిన సైనికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భద్రత దళాల కాన్వాయ్ చెక్పోస్ట్ సమీపంలోకి రాగానే బాంబును రిమోట్ కంట్రోల్తో పేల్చారు. అయితే ఆ పేలుడుకు తామే బాధ్యలమని ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించ లేదు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement