breaking news
India u19 vs Srilanka U19
-
IND vs SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.తొలి టెస్టు డ్రా కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.తొలి ఇన్నింగ్స్‌లో 411ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.148 పరుగులకే లంక ఆలౌట్ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.లక్ష్యం 472ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్‌చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.211 పరుగుల తేడాతో భారత్ జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన భారత బౌలర్లులక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లుభారత్: 411 & 208/3 డిక్లేర్డ్శ్రీలంక: 148 & 260చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
IND vs SL: శ్రీలంక ఆలౌట్.. భారీ ఆధిక్యంలో భారత్
భారత్ అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో శ్రీలంక యువ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.తొలిరోజే కుశాగ్ర సెంచరీకొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట నిలిచే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఓపెనర్లు లక్ష్య (0), సాగర్ (0) డకౌట్ కావడంతో... స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ యశ్వర్ధన్తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుశాగ్ర ఓజా శతకం (177 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించగా... కెప్టెన్ యశ్వర్ధన్ చౌహాన్ (89 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనల్ చౌహాన్ (108 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న ఈజంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది.రెండోరోజు ఆట సాగిందిలా..అనంతరం కెప్టెన్ అవుట్ కాగా... కుశాగ్రకు మనల్ చౌహాన్ అండగా నిలిచాడు... ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 131 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 411 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కాసేపటికే కుశాగ్ర (111) అవుట్ కాగా.. మనాల్ చౌహాన్ భారీ శతకం (244 బంతుల్లో 150)తో చెలరేగాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది.148 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో 122/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. కేవలం మరో 26 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దుల్నిత్ సిగెర 31 పరుగులతో లంక టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 25 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వాళ్లలో అవీష సమాశ్ (9), సెనుజ వెకునగొడ (5), కెప్టెన్ విమత్ దిన్సారా (8), కవిజ గెమాగే (7), వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో (4), గిమ్హాన్ మెండిస్ (4), విఘ్నేశ్వరన్ ఆకాశ్ (4) పెవిలియన్‌కు వరుస కట్టారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హేంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. కావ్యా పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 263 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భారత్.భారత్‌కు భారీ ఆధిక్యంబుధవారం నాటి భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లలో సాగర్ విర్క్ (17) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా (6) నిరాశపరిచాడు. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని 31, కెప్టెన్ యశ్వర్దన్ 5 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక బౌలర్లలో కవిజ గెమాగే తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 330 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు? -
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
శ్రీలంక అండర్-19 బ్యాటర్లకు భారత యువ బౌలర్లు చుక్కలు చూపించారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టారు. కాగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది.భారత్ భారీ స్కోరుకొలంబో వేదికగా టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసిన భారత జట్టు.. 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (193 బంతుల్లో 111), ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ (244 బంతుల్లో 150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (89 బంతుల్లో 78) అర్ధ శతకంతో రాణించారు.శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆది నుంచే షాకులు ఇచ్చారు.శ్రీలంక బ్యాటర్లకు చుక్కలుఓపెనర్లలో అవీష సమాష్ (9)ను ప్రణవ్ రాఘవేంద్ర పెవిలియన్‌కు పంపగా.. దిమంత మహావితన (24)ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడను ఈసారి భారత్ ఐదు పరుగులకే పరిమితం చేసింది. చిగురుపాటి వెంకట బౌలింగ్‌లో సెనుజ లక్ష్య రాయ్చందానికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత భారత బౌలర్లు జోరు కొనసాగించడంతో కెప్టెన్ విమత్ దిన్సార 8, కవిజ గమాగే 7, వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో 0 పరుగులకే పెవిలియన్ చేరారు. విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఆట ముగిసేసరికి శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, జగన్నాథ్ హెంచుదేశన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- శ్రీలంక మధ్య తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.చదవండి: జింబాబ్వేతో శ్రేయస్ అయ్యర్ సేనకు ముప్పు -
IND vs SL: శ్రీలంకతో టెస్టు.. భారత్ భారీ స్కోరు
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గాలె వేదికగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.ఓపెనర్లు డకౌట్ అయినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.శతక్కొట్టిన కుశాగ్రఈ క్రమంలో కుశాగ్ర శతకం పూర్తి చేసుకోగా.. యశ్వర్దన్ అర్ధ శతకం (78) చేసి అవుటయ్యాడు. కుశాగ్రకు తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మనాల్ చౌహాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఇక 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. భోజన విరామ సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 355 పరుగులు చేసింది. శతక వీరుడు కుశాగ్ర (193 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు: 111) రనౌట్ కాగా.. ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మనాల్ భారీ శతకంఅనంతరం అదే జోరు కొనసాగించిన మనాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్.. 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేశాడు. అయితే, గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో విఘ్నేశ్వరన్ ఆకాశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మనాల్ అవుటైన తర్వాత భారత జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా 10, జగన్నాథన్ హేంచుదేశన్ 4 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ యాదవ్ డకౌట్ కాగా.. చిగురుపాటి వెంకట 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రణవ్ రాఘవేంద్ర ఒక బంతిని ఎదుర్కొని ఖాతా ఏమీ తెరవలేదు.411 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 105.2 ఓవర్లలో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (78) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. మీరేం చేస్తున్నారు? -
డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. ఆధిక్యంలోకి భారత్ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.లక్ష్య డబుల్ సెంచరీతోకాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్సింఘే బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.శ్రీలంక భారీ స్కోరు కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లుఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్‌లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా? -
అదరగొట్టిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్ అండర్ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగి.. మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్ సిగెర (0) విఫలమైనా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ అండర్-19 జట్టు 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది. -
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
భారత అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ ఒంటిచేత్తో జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య గాలె వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్లు దుల్నిత్ సిగెర (0), దిమంత మహవితన (2) వికెట్లు కోల్పోయింది.సెనుజ డబుల్ సెంచరీఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ ఆచితూచి ఆడుతూ క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి రోజు ఆటలోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో రాణించగా.. కవిజ గమాగే 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ఈ క్రమంలో సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించింది. ఇక 344/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 424 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.సెనుజ వెకునగొడ మొత్తంగా 267 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 233 పరుగులు సాధించాడు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన అతడిని జగన్నాథన్ హెంచుదేశన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు.వర్షం వల్ల నిలిచిన ఆటఇక మిగిలిన వారిలో చమిక హీనతిగల 45 పరుగులు చేయగా.. పదకొండో నంబర్ బ్యాటర్ ఒషాడా మనాహర అనూహ్య రీతిలో 12 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జగన్నాథన్ హెంచుదేశన్ మూడు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, ప్రియాన్షు సింగ్ చెరో రెండు.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి భారత జట్టు ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసి.. లంక కంటే 399 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని 16, సాగర్ విర్క్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
భారత్‌తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
భారత్ అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీతో చెలరేగి.. లంక జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. శ్రీలంక 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఓపెనర్లను త్వరగానే అవుట్ చేసినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలే వేదికగా సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్‌కు దిగింది. భారత పేసర్ కావ్యా పటేల్ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఓపెనర్లలో దుల్నిత్ సిగెరను డకౌట్ చేసిన కావ్యా పటేల్.. దిమంత మహవితనను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో కాసేపే మిగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన సెనుజ వెకునగొడ క్రీజులో పాతుకుపోయి డబుల్ సెంచరీ కొట్టాడు.203 పరుగులతో అజేయంగా..తొలి రోజు ఆట ముగిసే సరికి సెనుజ మొత్తంగా 227 బంతులు ఎదుర్కొని 31 ఫోర్ల సాయంతో 203 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో ఆకట్టుకోగా.. కవిజ గెమాగే 49 పరుగులతో రాణించాడు. చమిక హీనతిగల 33 పరుగులతో సెనుజతో కలిసి క్రీజులో నిలిచాడు.ఫలితంగా సోమవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత్ ఆదిలో వికెట్లు తీసినప్పటికీ.. సెనుజ ద్విశతక ఇన్నింగ్స్ కారణంగా లంకదే పైచేయి అయింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు వికెట్లు తీయగా.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం -
ఆఖరి బంతికి సింగిల్.. భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక
హంబన్‌టోటా వేదికగా శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో భారత అండర్–19 జట్టు పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక జట్టు 2–1తో చేజిక్కించుకుంది.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం భారత్ అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో వన్డేలో మాత్రం శ్రీలంక భారత్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.వినీత్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జూనియర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. వీకే వినీత్ (VK Vineeth- 136 బంతుల్లో 131; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... లక్ష్య (63 బంతుల్లో 61; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ సాధించాడు.ఇక లంక బౌలర్లలో సెత్మిక సెనెవిరత్నె 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. గింహాన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా.. కవిజ గమాగే ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక అండర్–19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెనునగొడా హాఫ్ సెంచరీ (67)తో అలరించగా.. చమిక హీనతిగల అజేయ అర్ధ శతకంతో మెరిశాడు.ఆఖరి బంతికి సింగిల్ తీసికేవలం 68 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో చమిక 84 పరుగులు సాధించాడు. లతీంద్ర ఆకాశ్‌తో కలిసి అజేయంగా నిలిచి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదో బంతికి సిక్సర్ కొట్టిన చమిక.. ఆఖరి బంతికి సింగిల్ తీసి లంక జట్టు గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైన భారత్ సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది.చదవండి: నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్ అయ్యర్ -
నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి యూత్ వన్డేలో భారత్ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌టోటా వేదికగా భారత్- శ్రీలంక శనివారం తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి.టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. ఓపెనర్ దిమంత మహావితన (42) రాణించగా.. కవిజ గమాగే (77) భారీ అర్ధ శతకంతో చెలరేగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడా 91 పరుగుల వద్ద అవుటై సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల (46 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు, మోహిత్ ఉల్వా, రోహిత్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 321 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ 31 పరుగులు చేయగా.. సాగర్ విర్క్ హాఫ్ సెంచరీ (57)తో అలరించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని సైతం అర్ధ శతకం (52)తో మెరిశాడు.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ కుశాగ్రా ఓజా కేవలం 67 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 92 పరుగులు చేశాడు. కానీ సెత్మిక సెనెవిరత్నె బౌలింగ్ బౌల్డ్ కావడంతో శతకానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ (రాహుల్ ద్రవిడ్ తనయుడు) 14, అర్జున్ రాజ్‌పుత్ 13 పరుగులే చేసి నిరాశపరిచారు.అయితే ఆఖర్లో యశ్వీర్ గౌడ్, శవిన్ వినోద్ మెరుపులు మెరిపించారు. యశ్వీర్ 21 బంతుల్లో 33, వినోద్ 8 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 49 ఓవర్లలో స్కోర్లు సమం (320) అయ్యాయి. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొనగా.. ఆఖరి ఓవర్ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. అయితే, రెండో బంతిని వినోద్ ఫోర్‌గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. -
భారత్‌తో వన్డే.. శ్రీలంక భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెట్ జట్టుతో తొలి అనధికారిక వన్డేలో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో తడబడ్డా ఎట్టకేలకు మూడు వందల పరుగుల మార్కు దాటింది. కాగా మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆరంభంలో ఎదురుదెబ్బఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శనివారం వన్డే సిరీస్ మొదలైంది. హంబన్‌టోటా వేదికగా తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దుల్నిత్ సిగేరా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు.ఆ తర్వాత సీన్ రివర్స్అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ దిమాంత మహవితన (42)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగోడ (Senuja Wekunagoda- 91) స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, కావ్యా పటేల్ బౌలింగ్‌లో అర్జున్ రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.కెప్టెన్ విమత్ దిన్సారా (1) పూర్తిగా విఫలం కాగా.. కవిజ గమాగే అర్ధ శతకం (77)తో దుమ్ములేపాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 46 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ చమరిందు నెత్సారా 21 పరుగులు చేయగలిగాడు. కిత్మా వితానపతిరణ 5 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి శ్రీలంక 320 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు, మోహిత్ ఉల్వా, రోహిత్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. UPDATE: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్చదవండి: ‘నిన్ను ఆడించమని అతడికి చెప్పేయండి’ -
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్‌కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
భారత జట్టు ప్రకటన.. 16 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీ20 సిరీస్ రెండింటిలోనూ భారత జట్టును ఆమె ముందుండి నడిపించనుంది. అదేవిధంగా భవికకు డిప్యూటీగా మహక్ నర్వాసే వ్యహరించనుంది. ఇక శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం దీయా యాదవ్‌కు చోటు దక్కింది. కానీ ఆమెను టీ20లకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో 16 ఏళ్ల దీయాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు భారత జెర్సీలో సత్తాచాటేందుకు దియా సిద్దమైంది. కాగా ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక అండర్-19 టీమ్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చెన్నై, పుదుచ్చేరి వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్టీ20 సిరీస్ (చెన్నై): జూన్ 22, జూన్ 24, జూన్ 27 (మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం)వన్డే సిరీస్ (పుదుచ్చేరి): జూన్ 30, జూలై 3 (ఉదయం 9:00 గంటలకు), జూలై 6 (మధ్యాహ్నం 2:00 గంటలకు)భారత అండర్-19 టీ20 జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, తనిష్క శర్మ, ఈశ్వరి అవసరే, అవ్ని చౌదరి, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, మణియార్ మైత్రి, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).భారత అండర్-19 వన్డే జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, దీయా యాదవ్, ఈశ్వరి అవసరే, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, విధి పర్మార్, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).


