Global Oil Rates
-
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు మేలే!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒపెక్ పట్టు సడలుతోందా?1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్‌కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్‌ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్‌కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్.. -
చైనా ‘ఇంధన దిగ్బంధనం’పై తైవాన్ కసరత్తులు
ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్ బ్లాకేడ్) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్ఎన్జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.ఎస్కార్ట్ మిషన్లుఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్‌లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్‌కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.ఇంధన సంక్షోభం వైపు తైవాన్?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్‌కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్ఎన్జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
భారత్ కు గుడ్ న్యూస్.. ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలింపు.. ట్రంప్ సంచలన నిర్ణయం
-
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇంధన ఉత్పత్తి పెంపుఅమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్‌ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్లో అమెరికాను టాప్‌లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..అంతర్జాతీయ ధరలపై ప్రభావంయూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది. -
ఇజ్రాయెల్ యుద్ధం.. ఆయిల్ ధరలకు రెక్కలు!
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కల్పోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం (అక్టోబర్ 9) 4 శాతానికి పైగా పెరిగాయి. ముడి చమురు అధికంగా ఉన్న ప్రాంతంలో యుద్ధ వాతారణం నెలకొనడంతో చమురు సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఆసియా మార్కెట్లె బ్రెంట్ 4.7 శాతం పెరిగి 86.65 డాలర్లకు చేరుకోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.5 శాతం పెరిగి 88.39 డాలర్లకు చేరుకుంది. సర్వత్రా ఆందోళన హమాస్ ఆకస్మిక దాడి, దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన చేయడం వల్ల 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇరాన్లలో ఉద్రిక్తతలు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా ఉత్పత్తి కోతల కారణంగా సరఫరా తగ్గిపోవడంతో చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. తాజాగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ సంక్షోభం ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళలను మరింత పెంచుతోంది. -
దిగొస్తున్న చమురు ధర: రూపాయి పైపైకి
సాక్షి, ముంబై: ప్రపంచ ఇంధన ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయికి ఉత్సాహం వచ్చింది. డాలరు మారకంలో రూపాయి ఒక్కసారిగా 44 పైసలు జంప్ చేసింది. బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 79.32 వద్దకు చేరింది. శుక్రవారం సెషన్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. (బుల్ దౌడు, 60వేల ఎగువకు సెన్సెక్స్) ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. బుధవారం 0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించి 106.44కి చేరుకుంది. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఒక్క మంగళవారం ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ. 22,452 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. దీంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య దేశీయ ఈక్విటీలలో జోరు ఫారెక్స్ పెట్టుబడి దారుల దృష్టిని సానుకూలంగా మార్చిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొనుగోలుదారుల మద్దతుతో సెన్సెక్స్ 60వేల వద్ద, నిఫ్టీ 18 వేల వైపు పరుగులు తీస్తోంది. ఇండిపెండెన్స్‌డే, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లు వరుసగా సోమవారం, మంగళవారం పనిచేయలేదు. -
చమురు పైపైకి.. రూపాయి పాతాళానికి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఎఫ్ఐఐల అమ్మకాలు, ఎగిసిన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి గురువారం 77.81 వద్ద కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. రూపాయి 77.74 వద్ద ప్రారంభమైన రూపాయి ఆపై మరింత పడిపోయింది. బుధవారం 77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. స్టాక్మార్కెట్లో విదేశీపెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ డేటా ప్రకారం రూ.2,484.25 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాలు, ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడంతోపాటు భారతీయ షేర్ మార్కెట్లో ఎఫ్ఐఐలు అమ్మకాల జోరు రూపాయిని మరింత బలహీన పర్చాయని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. చైనాలో మేలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎగుమతులు 16.9 శాతం (సంవత్సరానికి) జంప్ చేయడం, అక్కడ లాక్డౌన్ పరిమితులను (షాంఘై ఇప్పటికీ కఠినమైన లాక్డౌన్) సడలింపు లాంటి పరిణామాల మధ్య చమురు ధరలు 13 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రాయిటర్స్ నివేదించింది. చమురు బ్యారెల్ ధర 123.43 డాలర్ల వద్దకు చేరింది. కాగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యం: ఆర్బీఐ జూన్ మానిటరీ పాలసీ రివ్యూలో 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ రెపో రేటును 4.9 శాతంగా ఉంచింది. ఏప్రిల్ 2022 నుండి రెపో రేటును పూర్తిగా 90 బేసిస్ పాయింట్లు పెంచడం రెండు నెలల్లో ఇది రెండవ పెంపు. అలాగే రానున్న సెప్టెంబరు రివ్యూలో కూడా వడ్డీ వడ్డింపు తప్పదనే భావన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఆహారం,ఇంధన ధరల కారణంగా, ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదైంది. అయితే ఇన్ఫ్లేషన్ను 4 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశానికి అత్యవసరమైన చమురు ఇంధనాలు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగనున్నాయట. గ్లోబల్‌గా చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు ఎగిస్తే, దేశీయంగా పెట్రోల్ ధర రూ.80ను, డీజిల్ ధర రూ.68ను టచ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. చమురు మార్కెట్‌ను సమతుల్య పరచడానికి ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) సభ్యులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ ధరలు బ్యారల్‌కు సుమారు 55 డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో వంతు చమురు ఉత్పత్తిని ఈ ఒపెక్ దేశాలే చేస్తుండటంతో వారు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని వెల్లడించింది.. నవంబర్ 28న ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు సంచలన ప్రకటన విడుదల చేశాయి. జనవరి 1 నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోత పెట్టేలా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద కోత. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 19 శాతం ఎగిశాయి. నాన్-ఒపెక్ సభ్యులు కూడా వియెన్నాలో డిసెంబర్ 10 మీటింగ్ తర్వాత మరో 0.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని కోత పెట్టనున్నట్టు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 80గా, లీటర్ డీజిల్ ధర రూ.68కు పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. 2017 మార్చికు బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధరలు 50-55 డాలర్లకు పెరుగనున్నట్టు వివరించింది. ఈ ధరలు 60 డాలర్లకు పెరుగనున్నట్టు తాము విశ్వసిస్తున్నామని, దీంతో దేశీయంగా కూడా రేట్లు పెరుగనున్నట్టు వెల్లడించింది.


