filmnagar club
-
ఒంటరి మహిళలే అతని టార్గెట్
హైదరాబాద్: బెట్టింగ్ కు బానిసై.. ఒంటరి మహిళలను మభ్యపెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా చనగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్‌గా ఉన్నాడు. కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న తన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ నగలు అమ్మిన డబ్బును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్‌లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మ (60)ని టార్గెట్ చేశాడు. ఈ నెల 17న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్‌నగర్‌లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు మిస్సింగ్ కేసులు నమోదు చేసిన అనంతరం యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్‌లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా బెట్టింగ్‌ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఒకవేళ పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం
-
ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో న్యూ ఇయర్ సంబరాలు (ఫోటోలు)
-
'సీను’ చకచకా మారిపోయింది
*ఫిల్మ్‌నగర్ కల్చరల్ సొసైటీకి ఆగమేఘాలపై భూమి కేటాయింపు *లీజు ఖరారు కాకుండానే కోట్ల విలువైన భూమి ధారాదత్తం *వారంలోనే దస్త్రాలు సిద్ధం.. * తెరవెనుక 'గంటా' మంత్రాంగం విశాఖపట్నం : వందలకోట్ల విలువైన భూములను పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్టుగా ఉంది జిల్లాలో భూముల పందేరం పరిస్థితి. కనీసం లీజు ఎన్నేళ్లకు ఇస్తున్నాం? ఎంత మొత్తానికో కూడా ఖరారు చేయకుండానే ధారాదత్తం చేస్తున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే శంకుస్థాపన చేసిన ఫిల్మ్‌నగర్ క్లబ్ కథా కమామిషు తెలుసుకుంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు తెలిసింది. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి. కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు. ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించ లేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే. రెండ్రోజుల క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్‌నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు. ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు ఆదివారమే భూమిపూజ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు. అప్పనంగా ఇస్తే ఊరుకోను..: ఎంపీ హరిబాబు ఎంపీ హరి బాబును ఆహ్వానించేందుకు సొసైటీ పెద్దలు ప్రయత్నించగా ప్రతిఘటన ఎదురైంది. పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వ మని కోరితేలేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ ఎంపీ వారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తా..సీఎంను సైతం నిలదీస్తానంటూ తీవ్ర స్థాయిలో వారిని హెచ్చరించినట్లు తెలిసింది.


