breaking news
Fertilizer subsidy
-
‘యాప్’.. యాతన
ఓటీపీ.. ‘దైవాధీనం’! మా గ్రామంలో దాదాపు 120 ఎకరాలకు పైగా దేవదాయ భూమిని 40 ఏళ్లుగా 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. చాలా మందికి కౌలు కార్డులు లేవు. యూరియా కోసం వెళితే ఓటీపీ ఎవరి పేరిట వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆర్‌ఎస్‌కేకు వెళ్తే రెండ్రోజులు ఆగండి.. మాట్లాడి చెబుతాం అంటున్నారు. –కలారి రామారావు, పెదకల్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: వర్షాలు వచ్చేశాయ్.. సీజన్ మొదలైంది.. ఏరువాక వచ్చేస్తోంది.. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. అదునులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కాడి వదిలేసింది. ఎరువుల సరఫరా, వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు తెచ్చిన ‘యాప్’తో వ్యవసాయదారులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామంలోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలతోపాటు సాగు ఉత్పాదకాలను అందించి ఆదుకున్నారని రైతన్నలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ అందక.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే.. చంద్రబాబు సర్కారు ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలికొదిలేసి యాప్‌ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు. సర్వర్ డౌన్.. యాప్ హ్యాంగ్ ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసేందుకు జాతీయ సమీకృత ఎరువుల నిర్వహణ మాడ్యూల్ (ఐఎఫ్ఎఫ్ఎం) యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎరువుల పంపిణీని చేపట్టగా.. మిగిలిన 26 జిల్లాల్లో ఏపీ వ్యవసాయ ఇన్పుట్స్ నిర్వహణ వ్యవస్థ (ఏఐఎంఎస్) యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్‌ల వినియోగంపై నూటికి 90 శాతం మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా యాప్‌లో సాంకేతిక, పరిపాలనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్వర్క్ అంతంత మాత్రంగా ఉండగా ఆర్ఎస్కేల్లో (రైతు సేవా కేంద్రాలు) సర్వర్ డౌన్/యాప్ హ్యాంగ్ సమస్యలతో రేపు రండి.. మాపు రండి అంటూ పంపేస్తున్నారు. యాప్‌లో రైతు వివరాలు, ఈ–క్రాప్, వెబ్‌ల్యాండ్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం, సకాలంలో ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్కాక తరచూ ఓటీపీలు, వేలిముద్రలు విఫలమవడం, బిల్లింగ్ ఆలస్యమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఓటీపీ, ఎంపిన్, ఫొటో, జియో ట్యాగింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ లాంటి దశలు రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్నా ఎరువుల కొనుగోలు ఆగిపోతోంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కౌలు రైతుల పాట్లు వర్ణనాతీతం యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సీసీఆర్సీ కార్డు, ఈక్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, మ్యుటేషన్ కాకపోవడం, భూ రికార్డులలో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీలు భూ యజమానుల ఫోన్‌కు వస్తుండటం, వారు అందుబాటులో లేకపోవడం, ఓటీపీ అప్‌లోడ్‌కు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం ఉండడం పెద్ద సమస్యగా మారింది. దీంతో 2–3 సార్లు ఓటీపీ జనరేట్ అవుతున్నా సకాలంలో అప్లోడ్ చేయలేకపోవడంతో చివరికి బుకింగ్ రద్దై మళ్లీ మొదటి నుంచి రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. మరోవైపు రైతులు ఎంచుకున్న డీలర్ పాయింట్ల వద్ద భౌతికంగా ఎరువులు ఉన్నా యాప్‌లో స్టాక్ అప్డేట్ కాకపోవడంతో ‘నో స్టాక్’ అని బుకింగ్ సమయంలో వస్తోంది. మొబైల్ నెట్వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ డౌన్ అయింది.. తరువాత రండి అంటూ తిప్పి పంపేస్తున్నారు. దేవదాయ, అటవీ, వక్ఫ్, అసైన్డ్, సొసైటీ లంక భూములు సాగుచేసే రైతులైతే బుకింగ్ కోసం అల్లాడుతున్నారు. ఎవరి పేరిట ఓటీపీ జనరేట్ అవుతోందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియా బస్తా రూ.350 నుంచి రూ.500, డీఏపీ రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీ.సిగడం మండలాల్లో పలువురు డీలర్లు గురువారం రోజు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడమే కాదు.. రసీదులు అడిగితే రైతులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా కొడమూరు మండలం రాజుపాలెంలో సుమారు 50 మంది రైతులు స్థానిక ఆర్‌ఎస్‌కేకు వెళ్తే సర్వర్ డౌన్ అనే సాకుతో తిప్పి పంపేశారు. తంటాలు పడి ఎరువులు బుక్ చేసుకున్నా మాగాణి, మెట్ట ప్రాంతాలు, పంట రకాలతో సంబంధం లేకుండా ఎకరాకు యూరియా, డీఏపీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఏ పంటకు, ఏ దశలో, ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్‌లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 15–20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదునుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల మోత.. రైతన్నలకు వాత కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023–24 సీజన్‌తో పోలిస్తే బస్తాపై రూ.750కి పైగా పెరిగాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25–50 శాతం మేర పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్లో కనీసం రూ.700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.నాడు.. ఇంటికే ఎరువులువైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య రైతన్నలకు వ్యయప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటికే సరఫరా చేసింది. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. ఇలా ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా జరిగింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్‌ల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది కంపెనీలు, డీలర్ల స్థాయిలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టకుండా రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోంది. ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు సాగు చేయడం మానేస్తే లక్షలాది ఎకరాలు బీడు వారతాయి. యాప్ విధానం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి భూమి సాగు చేసే వారికి డిమాండ్ మేరకు ఎరువులు సరఫరా చేయాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవంకేంద్ర జలశక్తి మంత్రి పాటిల్సహా ముఖ్యమంత్రుల హాజరుసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యామ్‌కు నూతనంగా అమర్చిన 33 గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్సహా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సమీపంలోని మునీరాబాద్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ పేరుకుపోయిన పూడికను తొలగిస్తే డ్యామ్‌లో 30 శాతం నీటి నిలువ పెరుగుతుందని తెలిపారు. పూడిక తొలగింపునకు సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని పేర్కొన్న ఆయన, ఇక తదుపరి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నదుల అనుసంధానం జరగాలన్న కేంద్రం సంకల్పానికి ఇది మరింత బలం చేకూరుస్తుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నదుల అనుసంధానం విజయవంతం అవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్లను పునరుద్ధరించడం లక్షలాది మంది రైతుల కన్నీరు తుడిచే గొప్ప పరిష్కారంగా అభివర్ణించారు. ఇది మూడు తరాల సమస్యకు పరిష్కారమని అన్నారు. మూడు రాష్ట్రాల రాష్ట్ర రైతుల హితం కోసం తుంగభద్ర డ్యామ్‌లో నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరస్పరం పొగడ్తల వర్షం!! చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధాన్ని మరోసారి బయటపెట్టింది. ‘రేవంత్ రెడ్డి నా శిష్యుడు. డ్యాషింగ్, డైనమిక్ సీఎం. అన్ని విషయాలపై తరచూ చర్చించుకుంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజీ పడరు. చురుకైన నాయకుడు’ అని చంద్రబాబు పొగిడితే, ‘చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు గురువు. పాలనలో ఆయన అనుభవం, దేశానికి ఆదర్శం. సాంకేతిక పరిపాలనలో చంద్రబాబు మార్పులు తెచ్చారు. ఆయన దూరదృష్టి దేశానికి ఆదర్శం. రాజకీయ జీవితంలో చంద్రబాబు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, డీకేలు కూడా ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. -
ఎరువుల సబ్సిడీ రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.భారత్‌పై సబ్సిడీ భారంయూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.రైతాంగానికి ఊరటప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.ఆయిల్ కంపెనీలకు మద్దతుగత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటుఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధిఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్ఎన్జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టిఅదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
దేశవ్యాప్తంగా రైతుబంధు!
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు. -
సబ్సీడీలు కాదు ప్రోత్సాహకాలు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని పోత్సహించడానికి ఎరువుల సబ్సిడీలకు బదులు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్రతిపాదించారు. దేశంలో తొలి ఆర్గానిక్ రాష్ట్రం సిక్కిం అని 2016లో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిక్కిం ప్రజలు వదులుకున్న ఎరువుల సబ్సిడీలకి రెండు రెట్ల మొత్తాన్ని నగదుగా ఇవ్వాలని కోరితే ప్రధాని స్పందించలేదని అని చామ్లింగ్ గుర్తు చేశారు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి బిహార్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం సాయం కోరుతున్నాయని తెలిపారు. సేంద్రీయ విధానానికి మారకుంటే మన భవిష్యత్ సురక్షితం కాదని హెచ్చరించారు. -
ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి
శాంతకుమార్ కమిటీ సిఫారసులను తిరస్కరించండి ప్రధానమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు సోమవారం ప్రధానిని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా శాంతకుమార్ కమిటీ చేసిన సిఫారసుల నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వ్యవసాయాధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. చివరకు దేశ ఆహార భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. ఆ సిఫారసులను ఆమోదిస్తే అటు ఆహార భద్రతతో పాటు.. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 50 శాతం మంది ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది’’ అని ఆ వినతిపత్రంలో ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... ఎఫ్‌సీఐ సేకరించకపోతే... ‘‘రైతులు తమ పంటలను మంచి ధర వచ్చేంతవరకు గిడ్డంగుల్లో దాచుకునే పరిస్థితి లేదు. పంట పండిన కొద్ది రోజుల్లోనే వారు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పంటను ఎఫ్‌సీఐ సేకరించలేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతయి. ఇది మానవ తప్పితమైన విషాదంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితినే చూస్తే 2010-11లో మంచి దిగుబడులు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎఫ్‌సీఐ కూడా కనీస మద్దతు ధర రైతులకు అందేలా చేయడంలో విఫలమైంది. రైతులు క్వింటాలు ధాన్యాన్ని రూ. 300 ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ఇది రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీంతో వారు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. పైగా పంట చేతికి వచ్చిన అక్టోబరు, నవంబరు మాసాల్లో సేకరణ జరగలేదు. దీని కారణంగా రైతులు కనీస మద్దతు ధర కంటే రూ. 150 తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే సరైన సమయంలో పత్తి పంట సేకరించడంలో సీసీఐ పూర్తిగా విఫలమైంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌సీఐల విధులను రాష్ట్రాలు నిర్వర్తిస్తాయని కేంద్రం ఎలా నమ్ముతోంది? గడిచిన పదేళ్లలో 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ బాధ్యతలను స్వీకరించేందుకు ఆర్థిక వనరులెక్కడివి? ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2015-16 బడ్జెట్లో మార్కెట్ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుస్తోంది.’’ స్వామినాథన్ సిఫారసులు అమలుచేయండి ‘‘మద్దతు ధరను నిర్ధారించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయాలని నాడు ఎన్డీయే కూడా కోరింది. కానీ 2014-15 సంవత్సరంలో ఎన్డీయే అతి తక్కువగా కనీస మద్దతు ధరను పెంచింది. పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంతోపాటు 50 శాతం లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్పీని ఖరారుచేయాలని ఆ కమిషన్ సూచించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో 2015-16 ఖరీఫ్ సీజన్లో వరికి కనీసం రూ. 1,700 ఎంఎస్పీగా ఖరారుచేయాల్సిన అవసరముంది. లేదంటే రైతులు దురవస్థలోనే కొనసాగుతారు. మా రాష్ట్రంలో రైతులు వరస తుఫాన్లతో, వరద్లతో గడిచిన నాలుగేళ్లుగా నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒక తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపానులో రైతు కొట్టుకుపోతున్నాడు. ఇలా దెబ్బతిన్న రైతుల్లో ఒక శాతం వారినీ రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఉదాహరణకు ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రూ. 21 వేల కోట్ల మేర నష్టపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనీసం దీనిలో 10 శాతం కూడా పునరావాసానికి, సహాయ చర్యలకు ఖర్చుపెట్టలేకపోయాయి.’’ ఎరువుల సబ్సిడీని పరిమితం చేయకండి ‘‘శాంతకుమార్ కమిటీ ప్రస్తుతం ఉన్న పద్ధతిని రద్దు చేసి హెక్టారుకు రూ. 7వేల చొప్పున ఎరువుల సబ్సిడీ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఏపీ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎన్పీకే వినియోగం చాలా ఎక్కువ. హెక్టారుకు రూ. 7 వేలకు పరిమితి విధిస్తే మాలాంటి రాష్ట్రాల్లో ఒక్క పంటకు కూడా సరిపోదు. రెండో పంటకు రైతులు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శాంతకుమార్ నివేదికను తిరస్కరించండి. కనీస మద్దతు ధరను ఖరారు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయండి.’’ -
పార్లమెంటు సమాచారం
ఎరువులకూ ప్రత్యక్ష నగదు బదిలీ!: రైతులకు ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు: ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్‌సభకు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఏడాది జైలు శిక్ష పడుతున్న ఈ యత్నం ఇక నేరం కాబోదన్నారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు 685: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో గత 8 నెలల్లో పాకిస్తాన్ 685 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. ఈ కాల్పుల్లో 8 మంది భద్రతా సిబ్బంది 16 మంది పౌరులు చనిపోయారని వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ మరణాలు 841: స్వైన్‌ఫ్లూతో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 22 మధ్య దేశంలో 841 మంది చనిపోయారని, 14,673 మందికి ఆ వ్యాధి సోకిందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. నల్లధన ం నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: నల్లధన నియంత్రణకు ప్రభుత్వం సాధ్యమైన చర్యలన్నింటినీ తీసుకుంటోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఆస్తుల వె ల్లడి తదితరాలకు సంబంధించి ఐటీ చట్టంలోని 139 సెక్షన్లో సవరణ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు.


