breaking news
Bruhan Mumbai munpipal Corporation
-
ముంబై ఫలితాలు.. శివసేనపై కత్తి దూసిన కంగనా
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. 2020లో అవిభక్త శివసేన అధికారంలో ఉన్నప్పుడు బాంద్రా వెస్ట్‌లోని తన బంగ్లాను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన ఘటనను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ‘మహిళా ద్వేషులు, రౌడీలు, నెపోటిజం మాఫియా’కు ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని కంగనా వ్యాఖ్యానించారు.ముంబైలో శివసేన (ఠాక్రే వర్గం) ప్రాబల్యం తగ్గి, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై కంగనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నన్ను దూషించి, నా ఇల్లు కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని రాష్ట్ర ప్రజలే బహిష్కరించారు. అహంకారులు, మహిళా వ్యతిరేకులకు ‘జనతా జనార్దనులే’ వారి స్థానం ఏమిటో చూపించారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.గతంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని కంగనా రనౌత్ కార్యాలయంలో కొంత భాగాన్ని నిబంధనల పేరుతో బీఎంసీ కూల్చివేసింది. దీనిపై కంగనా.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, నాడు న్యాయస్థానం బీఎంసీ చర్యను తప్పుబడుతూ, అది పూర్తిగా దురుద్దేశంతో కూడినదని స్పష్టం చేసింది. ముంబై పోలీసులపై, ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యల కారణంగానే నాడు బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని కంగనా ఆరోపించారు. నాటి అవమానానికి ఈనాటి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని ఆమె అన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ 11,79,273 ఓట్లతో (21.58 శాతం) ఏకంగా 89 స్థానాలను కైవసం చేసుకుని బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం సాధించింది. ముంబైతో పాటు పూణే, పింప్రి-చించ్వాడ్, థానే, నాసిక్, నవీ ముంబై వంటి కీలక నగరాల్లోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. ఇది కూడా చదవండి:అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు -
‘వంద మంది పోలీసులు మావాళ్లని కుమ్మేశారు’
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆరోపించారు.‘పోలీసులు తమ ప్రతాపం నేరస్తుల మీద చూపించాలి కానీ.. కార్యకర్తల మీద కాదు.. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మేము దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)నమోదు చేస్తున్నాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసీ)ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ మొత్తం 18 వార్డుల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. మేజిక్ ఫిగర్ సాధించడానికి 36 స్థానాలు అవసరం కాగా, జనవరి 15న జరిగిన పోలింగ్‌లో నగరంలో 60.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) మధ్య నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ లాఠీఛార్జ్ ఘటన జరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. #WATCH | Chhatrapati Sambhajinagar | Maharashtra Minister Sanjay Shirsat says, "Today is the counting of the votes, and on such a day. When our workers were coming into the centre, nearly 100 policemen opened lathi charge on them and wounded them severely... Action should be… pic.twitter.com/rq9E3T0WBV— ANI (@ANI) January 16, 2026రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత, శివసేనలో చీలిక వచ్చి షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో నమోదైన 55.53 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు -
‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పుదోవ పట్టిస్తూ (గ్యాస్‌లైటింగ్), ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు.‘ఓటు చోరీ అనేది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, ప్రజాస్వామ్య విలువల పతనంపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ-శివసేన (మహాయుతి) కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహాయుతి కూటమి దాదాపు 52 వార్డుల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 35 స్థానాల్లో, ఏక్నాథ్ షిండే వర్గపు శివసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 22 స్థానాల్లో, రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తూ వెనుకబడిపోయింది. అయితే అధికారిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాగా ముంబై నగరానికి అత్యంత కీలకమైన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘ విరామం తర్వాత జరిగాయి. చివరిసారిగా 2017లో బీఎంసీ ఎన్నికలు జరగగా, అప్పుడు ఎన్నికైన మేయర్ కిషోరి పెడ్నేకర్ పదవీకాలం 2022 మార్చితోనే ముగిసింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఎన్నికలు జరగడం, నాలుగేళ్ల తర్వాత ముంబై నగరానికి కొత్త మేయర్ రాబోతుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
BMC Election: 25 చోట్ల బీజేపీ ఆధిక్యం
ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరుగుతోంది. తొలి ట్రెండ్ల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ 68 స్థానాలతో ముందంజలో ఉండగా, శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కూటమి 42 స్థానాలతో, కాంగ్రెస్ 11 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై (బీఎంసీ)తో పాటు పుణె, నాగ్‌పూర్ తదితర నగరాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, సాంగ్లీ, కొల్హాపూర్, వసాయ్-విరార్, మాలెగావ్ వంటి నాలుగు కార్పొరేషన్లలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.బీజేపీ ముందంజ: ముంబైలో 227 వార్డులకు గాను ఇప్పటివరకు 98 వార్డుల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.సేన (UBT) గట్టి పోటీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) 32 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది.షిండే వర్గం: ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ప్రస్తుతం 15 వార్డుల్లో ముందంజలో ఉంది.ధారావిలో కాంగ్రెస్ బోణీ: ధారావిలోని 183వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆశా కాలే ఘనవిజయం సాధించారు. ఆమె షిండే సేన అభ్యర్థి వైశాలి షెవాలే, MNS అభ్యర్థి పారుబాయి కట్కేలపై 1,450 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మాజీ మేయర్ విజయం: వార్డు 182లో శివసేన (UBT) అభ్యర్థి, 7 సార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన మాజీ మేయర్ మిలింద్ వైద్య విజయం సాధించారు.గోరేగావ్‌లో బీజేపీ సత్తా: గోరేగావ్‌లోని బంగూర్ నగర్ (వార్డు 50)లో బీజేపీ అభ్యర్థి తేజస్వి ఘోసల్కర్ విజయం సాధించారు. ఆమె సేన (UBT)కి చెందిన యువ అభ్యర్థి తన్వీ దినేష్ రావును ఓడించి బీజేపీకి కీలక విజయాన్ని అందించారు.మీరా-భయందర్‌లో క్లీన్ స్వీప్: మీరా-భయందర్ ప్రాంతంలో షిండే సేనతో జరిగిన పోరులో బీజేపీ ఇప్పటికే 8 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం.ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో బీజేపీ జెండా: ముస్లింలు అధికంగా ఉండే మాన్‌ఖుర్డ్ (వార్డు 135)లో బీజేపీ అభ్యర్థి నవనాథ్ బాన్ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. VIDEO | Maharashtra civic polls results: BJP candidate and Maharashtra BJP media in-charge Navnath Ban celebrates his victory in the BMC polls.In early trends, the BJP–Shiv Sena-led Mahayuti appears to be ahead across multiple municipal corporations.#BMCElections2026… pic.twitter.com/1fqyFYMSN3— Press Trust of India (@PTI_News) January 16, 2026 ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్.. అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించవచ్చనే అంచనా వేశాయి. అయితే.. విపక్ష కూటమి మాత్రం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్టలోని ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో దాదాపు 1.03 కోట్ల మంది ఓటర్లు 1,700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణ ముంబైలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా నమోదైంది. ముఖ్యంగా కులాబా ప్రాంతం (వార్డు 227)లో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కేవలం 15.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది ముంబై సగటు పోలింగ్ శాతం 41.08 కన్నా చాలా తక్కువ. 2017 ఎన్నికల్లోనూ ఇక్కడ తక్కువ పోలింగ్ నమోదు కాగా, ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి ఆసక్తి చూపలేదు. హౌసింగ్ సొసైటీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు తెలిపారు.‘యాక్సిస్ మై ఇండియా’ అంచనాల ప్రకారం.. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ-శివసేన కూటమి 42 శాతం ఓటు షేర్‌తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపినప్పటికీ, మహా వికాస్ అఘాడి (శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్- ఎన్సీపీ(ఎస్పీ)కూటమి 58-68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12-16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.బీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (జనవరి 16) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 2,299 మంది అధికారులు తమ విధులను నిర్వహించనున్నారు. విక్రోలి, కాందివలిలోని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తర్వాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమ కూటమి 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్ పీఠంపై మరాఠీ హిందువే కూర్చుంటారని శివసేన నేత రాజు వాఘ్మారే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నాయి. -
మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్.. థాక్రే ఆరోపణలు
Maharashtra Elections Updates..ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్ నమోదుప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.#WATCH | Nagpur: Maharashtra CM Devendra Fadnavis and his family show their inked fingers after casting their vote for the Maharashtra local body elections. pic.twitter.com/ExLnWCm3xR— ANI (@ANI) January 15, 2026 ఎన్నికల నిర్వహణపై రాజ్ థాక్రే ఆరోపణలు..ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఆరోపణలు.తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.ఇది ఆమోదయోగ్యం కాదు.ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను Raj Thackeray on Voting Booth Issue : सॅनिटायझरने पुसलं तर मार्करची शाई जातेय : राज ठाकरे#RajThackeray #MNS #voting #abpmajha pic.twitter.com/zKkLAVwC1h— ABP माझा (@abpmajhatv) January 15, 2026ఓటు వేసిన నితిన్ గడ్కరీ, థాక్రేనాగపూర్లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే.ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్ థాక్రే. #WATCH | Maharashtra: MNS chief Raj Thackeray, along with his family, arrives at a polling station in Mumbai to cast his vote for the BMC elections. pic.twitter.com/jEPhUXUbjm— ANI (@ANI) January 15, 2026#WATCH | Union Minister Nitin Gadkari shows his inked finger after casting his vote at a polling station in Nagpur for Maharashtra local body polls. pic.twitter.com/F5IRM0qgFb— ANI (@ANI) January 15, 2026ఓటు వేసిన ప్రముఖులు.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్ముంబైలోని పోలింగ్ బూత్‌లో సచిన్ ఓటు వేశారు.సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Mumbai: Legendary cricketer Sachin Tendulkar shows his inked finger after casting his vote for the BMC elections.He says, "This is a very important election. It gives us a chance where we can express our opinion through votes. Everyone should come out and cast their… https://t.co/a3GAx722A7 pic.twitter.com/dweQFzV796— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన ప్రముఖులు వీరే.. #WATCH | Pune | After casting his vote in the 2026 Maharashtra municipal elections, Maharashtra Minister Chandrakant Patil says, "I exercised my right to vote... I fulfilled my duty this morning. I appeal to everyone to come out and vote... The BJP will bring development... and… pic.twitter.com/oq9JEKB8kA— ANI (@ANI) January 15, 2026 #WATCH | Mumbai: After casting his vote for the BMC elections, Musician Vishal Dadlani says, "...Hopefully, whoever wins will hold the elections on time. This is very important for the country, for democracy. But given the state of our city in the last few days, the hope is that… pic.twitter.com/v9vGyNuJ52— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన మోహన్ భగవత్, అక్షయ్ కుమార్మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. #WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg— ANI (@ANI) January 15, 2026 మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.బృహన్ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7— ANI (@ANI) January 15, 2026పోటీలో 1700 మంది అభ్యర్థులు.. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు. -
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్‌తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది. -
‘మహా’ రాజకీయం.. ఉద్దవ్, రాజ్ థాక్రే మధ్య కీలక అంగీకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో తమకు గట్టి పట్టున్న సీట్లను సమానంగా పంచుకోవాలని శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్ణయించాయి. మిగతా మున్సిపాలిటీల్లో 60:40 సూత్రాన్ని అనుసరించాలని తీర్మానించాయి. సీట్ల పంపకంపై దీపావళి వరకు స్పష్టత వచ్చే అవకాశముంది.బీఎంసీ పరిధిలోని ప్రాబల్యం కలిగిన స్థానాలను ముందుగా గుర్తించాలని కూడా అంగీకారానికి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ), ఎంఎన్ఎస్ సారథి రాజ్ ఠాక్రే వరుసకు సోదరులవుతారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు ప్రకటన కేవలం లాంఛనప్రాయమేనని ఇరుపార్టీల నేతలు అంటున్నారు. ముంబైతోపాటు థానె, నాసిక్, కల్యాణ్–డొంబివిలి ప్రాంతాల్లో రెండు పార్టీలకు గట్టి పట్టుంది. 2026 జనవరి 31వ తేదీలోగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గట్టి ఆదేశాలివ్వడం తెల్సిందే. 2025–26లో వార్షిక బడ్జెట్ రూ.74 వేల కోట్లు కలిగిన బీఎంసీ దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్. బీఎంసీలో 227 వార్డులున్నాయి.ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉద్దవ్, రాజ్ థాక్రే ఒకే వేదికపై మళ్లీ కలిశారు. 2005లో రాజ్ థాక్రే శివసేన పార్టీని వీడారు. పార్టీ వీడడానికి ఉద్ధవ్ కారణమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఇద్దరు సోదరులు మళ్లీ కలిసిపోయారు. -
ఉమ్మితే పర్సు ఖాళీ.. రూ.1,200 జరిమానా
ముంబై: ముంబైలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు బీఎంసీ హెచ్చరించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఉమ్మితే రూ.200 గా ఉన్న జరిమానా ఇపుడు రూ.1,200కి పెంచారు. ఇటీవలె బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ జరిమానా పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆరు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తుల నుంచి రూ.రూ. 28.67 లక్షల జరిమానా రూపంలో బీఎంసీ వసూలు చేసింది. కేవలం సాకినాకల ప్రాంతంలోని ఎల్ వార్డు నుంచి రూ .4.70 లక్షలు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.200 వసూలు చేస్తూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి నుంచి రూ.1,200 వసూలు చేయడాన్ని హైకోర్టు బీఎంసీని ప్రశ్నించింది. -
సోనూసూద్‌కు నిరాశ.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
సాక్షి, ముంబై: నటుడు సోనూసూద్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. అనధికారికంగా భవనాలు నిర్మించారనే ఆరోపణతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి వేసింది. ‘‘నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండి’’ అని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. మీకున్న అవకాశాన్ని కోల్పోయారు.. మీరు చాలా ఆలస్యమయ్యారు అని తెలిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. దీనిపై గతేడాది అక్టోబర్ 20న సోనూసూద్‌కి బీఎంసీ నోటీసులు అందించగా.. వాటిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే దాన్ని డిసెంబర్లో దిగువ కోర్టు కొట్టివేయడంతో సోనూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు గురువారం విచారించి అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సింగిల్ బెంచ్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నేరాలకు పాల్పడటం సోనూకు ఓ అలవాటుగా మారిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలు పొందాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్ డిపార్టుమెంట్ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని వివరించింది. అయితే ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూనే కేవలం ఎంసీజెడ్ఎంఏ (మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా కోవిడ్-19 వల్ల ఆలస్యమతోందని వివరించినా బీఎంసీ వారు వినలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. ఈ విషయమై సోనూపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
రోడ్లను మాకు వదిలేయండి..ప్లీజ్!
రాష్ట్ర ప్రభుత్వానికి బీఎంసీ లేఖ * అనుమతి కోసం నిరీక్షణ * ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీయే, పీడబ్ల్యూడీ, ఎమ్మెస్సార్డీసీలూ భాగస్వాములే * ఒకే గొడుగుకింద అయితే నిర్వహణ బాగుంటుందని బీఎంసీ వాదన * ఆదాయం పోతుందని మిగతా సంస్థల ఆందోళన సాక్షి, ముంబై : నగరంలోని అన్ని రోడ్ల నిర్వహణను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బృహన్ ముంబై మున్పిపల్ కార్పొరేషన్ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం బీఎంసీ పంపించింది. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జీల నిర్వహణను చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఒకే గొడుగు కింద వీటన్నింటిని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని బీఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ రోడ్ల నిర్వహణలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఎంసీ గొడుగు కింద అన్ని బ్రిడ్జీల నిర్వహణ బాధ్యతను చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఒక్క సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జిల నిర్వహణ చేపడితే సక్రమంగా నిర్వహించగలుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఫ్రీవే, శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీఏ ఆధీనంలో ఉన్నాయి. శాంతాకృజ్‌లో ఉన్న ఫ్లై ఓవర్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న అంధేరి ఫ్లై ఓవర్ కాకుండా ఎన్నో నిర్మాణాలను ప్రస్తుతం పీడబ్ల్యూడి, ఎమ్మెస్సార్డీసీ నిర్వహిస్తున్నాయి. కాగా, ఆగస్ట్‌లో అన్ని రోడ్లకు సంబంధించిన నిర్వహణ తామే చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రతిపాదనను పంపించింది. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వీటి నిర్వహణ బాధ్యతను చూస్తామని బీఎంసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, రోడ్ల నిర్వహణ నేపథ్యంలో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని చాలా ఏజెన్సీలు వీటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాయని, అవి ఏవీ తమ భాగస్వామ్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని బీఎంసీ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.


