appointment letters
-
కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్‌లో పెట్టారు. కాగా, కోడ్ తొలగిన వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది. సీనియారిటీ తారుమారు కాకుండా.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీజోన్ కేడర్లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్‌లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు. -
2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమించబడిన పోలీసు కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీని ప్రక్షాలన చేశాం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. పదేళ్లు అధికారంలో ఉంటూ.. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లుగా అధికారంలో ఉంటాం. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. కానీ.. నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారు. .. అసెంబ్లీ రానివారికి అధికారం ఎందుకు? ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్‌రావు అంటున్నారు. కేసీఆర్.. తన బంధువులకు అనే పదవులు కట్టబెట్టారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
అప్పులున్నా.. ఆర్థిక భారమైనా ఉద్యోగాలిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వానికి అప్పులు ఉన్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా.. వాళ్ల కుటుంబానికి ఉద్యోగాలు గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంలా వాళ్ల ఉద్యోగాలను తొలగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. -
వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కొన్నేళ్ల పాటు క్రికెట్లో అత్యంత ధనవంతమైన(Richest Cricketer) ఆటగాడిగా కొనసాగాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి ధోని వార్షిక ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1040 కోట్లు ఉండడం విశేషం. ధోని వార్షిక ఆదాయం.. కోహ్లి కంటే(రూ.1050 కోట్లు) కేవలం పది కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్మెంట్స్, ఎండార్స్మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా(TTE) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్మెంట్ లెటర్లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు(రూ.12,650-47,650)గా ఉండడం ఆశ్చర్యపరిచింది. నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. ఇవీ గాక HRA(హౌస్ రెంటల్ అలెవెన్స్) కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400..(సబ్ ప్లాంట్స్‌లో పనిచేస్తే అదనంగా మరో రూ.8 వేలు).. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) కాగా అప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్న ధోని ఈ జాబ్ చేశాడా లేదా అన్నది పక్కనబెడితే.. అప్పటికి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని బ్రాండ్‌వాల్యూ ఎంతలా ఉందనేది ఈ లెటర్ చెప్పకనే చెప్పింది. ఇక ఇండియా సిమెంట్స్ ఎవరిదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే బంధం కొనసాగిస్తే వస్తోన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ధోని.. రోహిత్‌తో(ముంబై ఇండియన్స్)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 2010, 2011, 201, 2021లో సీఎస్కేను విజేతగా నిలిపిన ధోని తాజాగా 2023లో సీఎస్కేకు ఐదోసారి టైటిల్ అందించాడు. ఇక 2024 ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. రానున్న తొమ్మిది నెలల్లో వచ్చే సీజన్ ఆడడంపై క్లారిటీ ఇస్తానని(అప్పటివరకు ఫిట్‌గా ఉంటే) ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు. చదవండి: Shaka Hislop Collapsed Video: లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్ Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ -
ఉద్యోగ నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి అంతం
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాల వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సమూల మార్పులతో అవినీతి, బంధుప్రీతికి అవకాశాలు అంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన మంగళవారం 71,000 మందికి నియామక పత్రాలను వర్చువల్ కార్యక్రమంలో అందజేశారు. వీరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు లభించాయి. ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి తుది ఫలితాలు ప్రకటించే దాకా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేశామని వివరించారు. నియామకాల ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా, పక్షపాత రహితంగా మార్చామని అన్నారు. గ్రూప్–సి, గ్రూప్–డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేశామని తెలిపారు. గత తొమ్మిదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకుందని ఉద్ఘాటించారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(మే 16)న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ స్ఫూర్తితో తమ ప్రయాణం ఆనాడే మొదలైందన్నారు. ‘వికసిత్ భారత్’ కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. ఇదే రోజు సిక్కిం రాష్ట్రహోదా పొందిందని వివరించారు. దేశమంతటా కొత్త ఉద్యోగాల సృష్టి మన దేశంలో 2018–19 నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని, ఈపీఎఫ్ఓ గణాంకాలను బట్టి ఈ విషయం నిరూపణ అవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పెరుగుతున్నాయని, మన ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, దేశంలో ప్రతిమూలనా కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోతున్నాయని వెల్లడించారు. ఇకస్టార్టప్ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని అన్నారు. 2014 కంటే ముందు దేశంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని తెలియజేశారు. స్టార్టప్ కంపెనీల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. యువత సంక్షేమం, అభివృద్ధి పట్ల తమ అంకితభావం, చిత్తశుద్ధికి రోజ్‌గార్ మేళాలే నిదర్శనమని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని వివరించారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. దేశంలో ఇప్పుడు యూనివర్సిటీల సంఖ్య 1,100కు, మెడికల్ కాలేజీల సంఖ్య 700కు చేరిందన్నారు. -
Aafrin Hirani: ఆదిలాబాద్ అమ్మాయికి రెక్కలొచ్చాయి
అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళా పైలెట్ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్ జిల్లా నుంచి రెండో పైలెట్ అయ్యింది ఆఫ్రిన్ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్‌కు ఆపాయింట్మెంట్ లెటర్ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్ తండ్రి ఆఫ్రిన్ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్ పైలెట్ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్ పైలెట్ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్‌లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్లి ‘కమర్షియల్ పైలెట్ లైసెన్స్’ (సి.పి.ఎల్) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్ అయ్యింది. ‘నేను పైలెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్. 28 ఏళ్ల ఆఫ్రిన్ ఇప్పుడు ఇండిగో పైలెట్. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్‌ను ఆఫ్రిన్ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్ ఆఫ్రిన్‌ని’ అని మైక్రోఫోన్లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిల్లర అంగడి నుంచి నింగికి ఆఫ్రిన్ తండ్రి అజిజ్ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతను స్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్ పైలెట్ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూల్’ పేరుతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్ చేసి మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్ వల్ల ఆమె అపాయింట్మెంట్ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్. మత సామరస్యం ఆఫ్రిన్‌కు పైలెట్‌గా అపాయింట్మెంట్ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్‌లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్ రావచ్చు. ఆడపిల్లలను స్కూల్ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్ ఇస్తే ఆకాశమే హద్దు. -
సవాళ్లున్నా మున్ముందుకే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉద్ఘాటించారు. అడ్డంకులను అధిగమించాం.. ‘‘అంతర్జాతీయంగా పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న మాట ముమ్మాటికీ వాస్తవం. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. శతాబ్దానికి ఒకసారి కనిపించే కోవిడ్–19 లాంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. ఈ విషయం ఎవరూ ఆలోచించడం లేదు. కరోనా వైరస్ ప్రపంచమంతటా ప్రతికూల ప్రభావం చూపింది. అయినప్పటికీ ఇలాంటి సమస్యల నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. రిస్క్‌లు తీసుకున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ప్రభుత్వ విభాగాల పనితీరు, సామర్థ్యం ఎంతగానో మెరుగుపడింది. ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా.. డ్రోన్ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని మోదీ పేర్కొన్నారు. -
ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా, సుమారు లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని అన్నారు. ప్రైవేటు రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉందని.. ప్రజలకు సేవ చేయడంలో తమదైన మార్కు చూపించాలని విజ్జప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఒకరూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించారో.. అలాగే ఒక రూపాయి తీసుకోకుండా నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జలమండలిని మరింత అభివృద్ది పథాన తీసుకెళ్లేలా కొత్త ఆలోచనలతో పనిచేయాలని సూచించారు. చదవండి: కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే! -
ఔట్‌సోర్సింగ్‌కు ఊపిరి
-
ఉద్యోగాల విప్లవం.. నియామకాల సంబరం!
సాక్షి, అమరావతి: పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులోభాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలల్లో 19 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా నియామక ప్రతాలను అందజేసింది. ఆ వివరాలు జిల్లాల వారీగా.. పశ్చిమ గోదావరి గ్రామ,వార్డు సచివాలయ అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ ముత్యాల రాజు మాట్లాడుతూ.. 4600 మంది అభ్యర్థులకు సోమవారం ఒక్క రోజే నియామక పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. 16 కేటగిరిలో జిల్లాలో 9576 నియామకాల్లో 8712 మంది అభ్యర్థులకు కాల్ లేటర్స్ పంపామని అన్నారు. 72 గంటల్లో స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆ దిశగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. తన ఇన్నేళ్ల ఉద్యోగ నిర్వహణలో ఈ విధంగా ఒకే సారి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..అభ్యర్థులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ ఉద్యోగాల కోసం విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రుల కూడా ఎన్నో కలలు కన్నారని, కావాలనే ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద జల్లుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ 1,26,000 కుటుంబాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. గ్రామ స్థాయిలో పనిచేసే తామందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావలని కోరారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ఆశకిరణమని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాలకు సీఎం జగన్ నడుంబిగించారని, రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా మొత్తం 1,36000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉద్యోగాలు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రలో వైఎస్ జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హమీనీ కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారని, లంచాలకు తావు లేకుండా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శేషగిరి బాబు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరప్రసాద్ రావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాలు ఎంత నిజాయితీగా జరిగాయో, ఉద్యోగులు కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని సూచించారు. అవినీతి లేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నియామకాల పత్రాలను తిరుపతి ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, తుడా విసి గిరీషా పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం నగరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, అర్థర్, ఎంపీ సంజీవ్ కుమార్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందజేశారు. మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం డివిజనల్ రెవిన్యూ అధికారి ఎం శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు. ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ పావని, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కమీషనర్ రమేష్ పాల్గొన్నారు. విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే లు కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, అలజంగి జోగారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన అభ్యర్థులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ఎంపీ రంగయ్య, ఎంఎల్సీ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర్రంలో కొత్త పరిశ్రమలు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సోమవారం తగరపువలసలో వార్డు వలంటీర్లకు నియామక ప్రతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు తెలిపారు. తగరపువలస, పద్మనాభం ప్రాంతంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపునిస్తుందన్నారు. చిట్టివలస జ్యూట్ కార్మికుల బకాయి ఆఖరి పైసా కూడా అందేలా చేస్తానని చెప్పారు. సాధికారిత సాధించే విధంగా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
గిద్దలూరు: తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ తిరుగున్న యువకుడిని గురువారం గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని వడ్డెమానుకు చెందిన కర్నాటి గురువినోద్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లెలో అవ్వ, తాతల వద్ద ఉంటున్నాడు. గిద్దలూరులోని ఓ కళాశాలలో ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతనికి డిఫెన్స్ సర్వీసెస్, పోలీసు అధికారిని కావాలన్న ఆశ బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఐపీఎస్, డిఫెన్స్ సర్వీస్‌లకు సంబంధించిన కోచింగ్‌లు తీసుకున్నాడు. ఇతనితో పాటు కోచింగ్ తీసుకున్న వారంతా వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వినోద్‌కు మాత్రం ఉద్యోగం రాలేదు. దీంతో తనలో ఉన్న కోర్కెను తీర్చుకోవాలని, అందరితో ఐపీఎస్ అనిపించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు చెందిన నకిలీ ఐడీ కార్డు, వాయుసేనకు సంబంధించి ఫైలెట్‌గా ఐడీ కార్డు, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు సెలక్ట్ అయినట్లు అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసుకున్నాడు. తాను ఐపీఎస్ అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు సైతం వచ్చిన ఇతడు తాను ఐపీఎస్ అధికారినంటూ హడావిడి చేయగా అనుమానం వచ్చిన ఎస్ఐ కొమరం మల్లికార్జున అతని ఐడీ కార్డులపై విచారణ చేపట్టారు. కాగా ఇతను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటున్నాడే తప్ప ఎవరినీ బెదిరిం చడం, నగదు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు సంబంధించిన ఐడీ కార్డు, అపాయింట్మెంట్ లెటర్‌ను పోర్జరీ చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
కరీం‘నగరం’లో మాయగాడు..
♦ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఘరానా మోసం ♦ కొందరికి అపాయింట్మెంట్ లెటర్లు ♦ ఓ యువతికి ఏకంగా తహసీల్దార్ ఉద్యోగం ♦ సర్వీస్‌బుక్ అందజేత ♦ పలువురికి రూ.17 లక్షల టోపీ ♦ నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ క్రైం: కరీం‘నగరం’లోని ఉద్యోగాల మాయగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి అపాయింట్మెంట్ లెటర్లు ..సర్వీస్ బుక్‌లు అందించి పలువురి నుంచి రూ.17 లక్షల వరకు దండుకున్న బాగోతం బయటపడింది. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్(22) సిరిసిల్లలో అగ్రహరం పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా కోర్స్ చేశాడు. చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటు పడి అమాయకులను మోసం చేయాలని నిర్ణయించుకుని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు బాగా పరిచయమని నమ్మించేవాడు. తన తండ్రి కూలీగా పని చేస్తుండగా పెద్ద కోటిశ్వరుడని దుబాయ్‌లో పలు కంపెనీలు ఉన్నాయని తన భార్యతో గొడవలు జరిగి ఇక్కడి వచ్చానని నమ్మించేవాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అందినకాడికి దండుకుని పారిపోవడం పనిగా పెట్టుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా మోసం కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన దయ్యాల రజిత అనే డిగ్రీ చదువుతున్న యువతికి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగంలో జాయిన్ చేయిస్తానని చెప్పి అమెను సిరిసిల్ల కలెక్టరేట్‌కు తీసుకెళ్లి అక్కడ సార్ లేరని నీకు జాబ్ ఒకే అయిందని నమ్మించాడు. నెల రోజుల శిక్షణ ఉందని హైదరాబాద్ జీఎంహెచ్‌సీలో ట్రెయినింగ్ ఉందని కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ తిప్పి వచ్చేవాడు. నెలతర్వాత పదోన్నతి కల్పించారని నమ్మించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ తంగళ్లపల్లి తహసీల్దార్‌గా వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్‌తోపాటు సర్వీస్‌బుక్ అందించాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని మళ్లీ పోటీకి వస్తారని వారిని బురిడీ కొట్టించాడు. ఉద్యోగం వచ్చిందని షిర్డీకి వెళ్లి మొక్కుకుని వద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి విమానంలో ఔరంగాబాద్ వరకూ అక్కడి నుంచి షిర్డీకి వెళ్లి అక్కడ స్టార్ హోటల్లో బస చేయించాడు. తిరిగి మళ్లీ విమానంలో వచ్చారు. ఇలా లక్ష ఖర్చు చేయించాడు. తహసీల్దార్‌కు కారు ఉండాలని కారు కొనిపించాడు. ఉన్న ఉద్యోగం వదులుకుని.. హైదరాబాద్‌లోని నేరేట్‌మెట్‌కు చెందిన తొంటి పర్శరాములు–అంజలి దంపతులను పరిచయం చేసుకున్నారు. పర్శరాములు ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ.30 వేల వేతనంలో పని చేస్తుండగా పర్శరాములుకు జీఎంహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్‌గా అంజలికి ఇబ్రహీంపట్నం సమీపంలోని బోంగుళూర్ మోడల్ స్కూల్లో జానియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి రూ.3 లక్షలు తీసుకుని వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాడు. స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆర్డర్ రాలేదని చెప్పడంతో పాఠశాల సమీపంలో నివాసం ఉండాలని చెప్పడంతో ఉన్న ఉద్యోగం వదలి అక్కడే ఉన్నారు. ఎంతకీ ఉద్యోగం రాకపోయే సరికి పోలీసులకు ఆశ్రయించారు. డ్రైవర్ ఉద్యోగం అంటూ.. ముత్త శ్రీౖశైలంను పరిచయం చేసుకొని కొత్తగా సృష్టించిన తహసీల్దార్ వద్ద ప్రభుత్వ డ్రైవర్‌గా అతడి భార్య శరణ్యకు మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దానికి రూ. 2.5 లక్షలు ఖర్చ అవుతాయని తెలుపగా రూ.1.30 లక్షలు ముట్టచెప్పారు. కొద్దిరోజులకు శ్రీశైలంనకు తంగళ్లపల్లి తహసీల్దార్‌కు డ్రైవర్‌గా అతడి భార్యకు కరీంనగర్ కలెక్టరేట్లో అటెండర్ ఉద్యోగం వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్లు సర్వీస్ బుక్‌లు ఇచ్చాడు. సముద్రాల మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని చిమ్మల సంతోష్‌కు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులకు లెటర్ చూపించాడు. ఎలాంటి ఆర్డర్ రాలేదని అక్కడి వారు చెప్పడంతో మరో రెండుమూడు రోజుల్లో వస్తుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. అతడు ఇచ్చిన రూ.1.50 వేలతో జల్సాలు చేసుకొని కొత్తగా కారును కూడా కొనుగోలు చేశాడు. దుబాయి పారిపోయి.. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి.. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో సాయికుమార్‌ను నిలదీసి టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడికోసం వెతకడంతో విషయం తెలుసుకున్న సాయికుమార్ ఈనెల4వ తేదీన దుబాయి పారిపోయాడు. జల్సాలకు అలవాటు పడడంతో అక్కడ కూడా ఎలాంటి పని చేయలేకపోయాడు. తిరిగి కరీంనగర్ రాగా పక్కా సమాచారంతో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు పట్టుకున్నారు. సాయికుమార్‌పై అప్పటికే కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, బెజ్జంకి పీఎస్‌లో ఒకటి, నేరేడుమెట్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నట్లు సీపీ తెలిపారు. నకిలీలను నమ్మవద్దు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక క్రమపద్ధతి ప్రకారం భర్తీ చేస్తారని డబ్బు ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు రావని తెలిపారు. ఇలాంటి నకిలీలను నమ్మి మోసపోద్దన్నారు. చివరకు అటెండర్ జాబు రావాలన్నా కూడా ఒక పద్ధతిగా భర్తీ ఉంటుందని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్‌కు రివార్డులు మహామాయగాడిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ గౌస్‌బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజులను సీపీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. – సీపీ కమలాసన్‌రెడ్డి -
ఏకగ్రీవమైన వార్డులు
కందుకూరు: మండల పరిధిలోని మురళీనగర్ 6వ వార్డు, లేమూరు 3వ వార్డుకు నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మురళీనగర్ నుంచి 6వ వార్డుకు వాంక్డావత్ లలిత మాత్రమే బరిలో ఉండటంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ అనూరాధ ప్రకటించారు. లేమూరు 3వ వార్డుకు నలుగురు రంగంలో ఉండగా మంచాల అంజమ్మ నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో ముగ్గురు బరిలో నిలవడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైయింది. పోటీలో ఉన్న మంచాల సునీతకు గ్యాస్‌స్టవ్, ముచ్చర్ల సంధ్యారాణికి హార్మోనియం, మంచాల భాగ్యమ్మకు విద్యుత్ స్తంభం గుర్తును కేటాయించారు. ఈనెల 8న ఎన్నిక జరగనుంది. పెద్దేముల్ 4వ వార్డు ఏకగ్రీవం పెద్దేముల్: మూడు రోజుల నుంచి ఉత్కంఠం రేపిన పెద్దేముల్ గ్రామ పంచాయతీ 4వ వార్డు ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ముగ్గురు నిమినేషన్ వేశారు. శనివారం పడగళ్ల చంద్రమ్మ, దాసరి నర్సమ్మ విత్ డ్రా చేసుకోవడంతో నత్తి నర్సమ్మ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి రాములు తెలిపారు. అనంతరం నర్సమ్మకు నియామక పత్రాన్ని అందచేశారు. దీంతో టీఆర్ఎస్ గ్రామ, మండల నాయకులు నర్సమ్మను అభినందించారు. -
ఏఈలకు నియామక పత్రాలు అందజేసిన జూపల్లి
హైదరాబాద్ : భవనాలు లేని పంచాయతీలకు భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌లో ఎంపికైన 392 మందికి మంత్రి జూపల్లి కృష్ణారావు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రహదార్లు వేయిస్తామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. -
రైల్వే గ్రూప్-డి ఫలితాలు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2012 ఆగస్టు 17న నిర్వహించిన గ్రూప్ డి ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షల్లో 1,098 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి రూ.1,800 గ్రేడ్ పేతో జీతభత్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. రూ.5,200 నుంచి రూ.20,200 వేతన స్కేలు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో అపాయింట్మెంట్ లెటర్లు అందుతాయని చెప్పారు. ఫలితాలు, ఇతర వివరాలకు 040-27788824 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.