రైల్వే గ్రూప్-డి ఫలితాలు వెల్లడి | railway group-d results issue | Sakshi
Sakshi News home page

రైల్వే గ్రూప్-డి ఫలితాలు వెల్లడి

May 17 2014 12:40 AM | Updated on Sep 2 2017 7:26 AM

దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 2012 ఆగస్టు 17న నిర్వహించిన గ్రూప్ డి ఫలితాలను శుక్రవారం వెల్లడించింది.

సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే  రిక్రూట్‌మెంట్ సెల్  2012 ఆగస్టు 17న నిర్వహించిన గ్రూప్ డి ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షల్లో 1,098 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు  సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు. వీరికి  రూ.1,800 గ్రేడ్ పేతో జీతభత్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. రూ.5,200 నుంచి రూ.20,200 వేతన స్కేలు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో అపాయింట్‌మెంట్ లెటర్లు అందుతాయని  చెప్పారు. ఫలితాలు, ఇతర వివరాలకు 040-27788824 కు ఫోన్ చేసి  తెలుసుకోవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement