
అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో(సెప్టెంబర్ 18, గురువారం) మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడంలేదని.. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందన్నారు.










