భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది
తన ఆత్మకథ ‘విట్‌నెస్’లో సాక్షి ప్రస్తావించిన విషయాలే ఇందుకు కారణం
భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీలో పోరాటం చేసిన విషయం తెలిసిందే
వీరిలో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా ముందు వరుసలో నిలబడ్డారు
ఈ నేపథ్యంలో నాటి నిరసనకు సంబంధించి సాక్షి తన పుస్తకంలో రాసిన విషయాలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి
సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై సాక్షి తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం
ఉద్యమకాలంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు అని సాక్షి అభిప్రాయపడింది
వీరు ఇలాంటి సడలింపు కోరడం వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని సాక్షి పేర్కొంది
అంతేకాదు.. బ్రిజ్‌భూషణ్‌ఘ 2021 నాటి ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా హోటల్ గదిలో వేధించిన తీరునూ ప్రస్తావించింది
ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు
ముఖ్యంగా ఆమె భర్త గురించ ఆరా తీస్తున్నారు
హర్యానాలో సెప్టెంబరు 3, 1992లో సాక్షి జన్మించింది
ఆమె తల్లిదండ్రులు సుఖ్‌బీర్ మాలిక్, సుదేశ్ మాలిక్
ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సాక్షి మాస్టర్స్ చేసింది
సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియాన్‌ను సాక్షి పెళ్లాడింది
2010 యూత్ ఒలింపిక్స్ సందర్భంగా సత్యవర్త్ రెజ్లర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు
2014 కామన్‌వెల్త్ క్రీడల్లో 97 కేజీల విభాగంలో సత్యవర్త్ రజత పతకం గెలిచాడు
సత్యవర్త్ అర్జున అవార్డు గ్రహీత
సత్యవర్త్ తండ్రి సత్యవాన్ కడియాన్ కూడా రెజ్లరే
గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా సాక్షి, సత్యవర్త్‌కు పరిచయం పరిచయం కాస్త ప్రేమగా మారి 2017, ఏప్రిల్ 2న ఇరు కుటుంబాల సమక్షంలో సాక్షి, సత్యవర్త్ పెళ్లి బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంతో పాటు సాక్షి వేసే ప్రతి అడుగులోనూ అండగా ఉంటూ సత్యవర్త్ పెళ్లినాటి ప్రమాణాలు నిజం చేస్తున్నాడు


