‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. నేను నీకు విడాకులు ఇస్తున్నా(అని మూడుసార్లు రాశారు) టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మఖ్తూమ్ సామాజిక మాధ్యమాల ద్వారా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమెకు అక్కడి మహిళ లోకం మద్దతు నిలిచింది.
దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మఖ్తూమ్ సామాజిక మాధ్యమాల ద్వారా సంచలన ప్రకటన చేశారు
తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మఖ్తూమ్‌తో విడాకులు తీసుకొంటున్నట్లు తెలిపారు
ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఇన్‌స్టా వేదికగా ఆమె ఇలా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది
ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ కుమార్తె షేక్ మహ్రా
బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఈమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు
దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్‌తో గతేడాది మే నెలలో ఈమె వివాహం జరిగింది


