
ఎగిరే హీరోలు కావేవి కవితకు అనర్హం అన్నట్లు పతంగుల తయారీకి ఏదీ అనర్హం కాకుండా పోయింది. సినీ హిరోలు, రాజకీయ నాయకులు, హీరో హీరోయిన్లు అందరిని గాలిలో తేలాడించే విధంగా నల్లగొండలో రూపుదిద్దుకున్న పతంగులు.

చిన్నారి చిరుతలం.. నల్లగొండ సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్‌లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో అబ్బురపరిచిన చిన్నారుల నృత్యవిన్యాసం.

హక్కుల కోసం పోరాడేస్తాం... నల్లగొండ సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్‌లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా చిన్నారుల ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాల్లోని చిత్రమిది.

బటయకు వస్తున్నా... పాము పని పట్టేస్తా కుత్బల్లాపూర్ లో బోను నుంచి బయటకు వస్తూ కెమెరా కంటపడిన ముంగీస.

చదువులమ్మ చెట్టు నీడలో... త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మర్రిచెట్టు నీడలో చదువుకుంటున్న నిరుద్యోగులు

మంచిగుందా మా ఫోజు... శిల్పారామంలో యూత్ ఫెస్టివల్ లో సందడి చేసిన కళాకారిణుల 'చిత్రా'నందం.

పడిపోలేదు.. పోటీ పడుతున్నాం తిరుపతిలో జరిగిన బాలుర ఈత పోటీల్లోని కెమెరాకు చిక్కిన విన్యాసం.

ఆకాశమంత స్వేచ్ఛమాది... సూర్యాస్త సమయంలో నెల్లురూలో కనిపించిన అపురూప దృశ్యం.

అమ్మ ఆవేదనతిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణించిన శిశువును గేటు ముందరే పెట్టుకుని ధర్నా చేస్తున్న ఓ తల్లి.

పండుగకు వచ్చిన ఫ్లెమింగోలు...సంక్రాంతి పండగ, ఫ్లెమింగో పక్షుల పండగ ఒకేసారి వచ్చాయి. స్వేచ్ఛా విహంగాలు వీసాలతో పనిలేకుండా రంగురంగుల రెక్కలతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సులో విహరించాయి ఇలా...

మాతృత్వ మధురిమ... వేలకిలో మీటర్లు ప్రయాణం చేసిన పిల్లలకు ఆహారం అందించడంలో మాతత్వ మధురిమ చూపుతూ కూనలకు ఆహారం అందిస్తున్న తల్లి ప్రేమ. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దొరవారిసత్రం మండలం నేలపట్టులో కనువిందు చేస్తున్న దృశ్యం

బహుదూరపు బాటసారి... వేల మైళ్లు ప్రయాణం చేసి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సుకు విచ్చేసిన ఫ్లెమింగో.

నాయకుడి చెలగాటం.. రాజకీయనాయకుల ఫ్లెక్సీల వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. పంజగుట్ట ఫ్లై ఓవర్పై కనిపించిన ఫ్లెక్సీయే ఇందుకు ప్రత్యక్ష 'సాక్షి'.

నా పేరు ఉంటే ఒట్టు.. ఆహార భద్రత కార్డుల లబ్దిదారుల జాబితాను కుత్భుల్లాపూర్ అధికారులు గోడకు అంటించారు. చాంతాంత జాబితాలో తనపేరు కోసం వెదుకుతున్న వృద్ధుడు.

మెట్రో చకా చకా... హైదరాబాద్ మెట్రో రైలు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పంజగుట్టలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులను 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించిందిలా.

పసిడి కాంతులు... పచ్చదనం, పొగమంచు ఉదయ కిరణాలను తన ప్రకాశంలో కలుపుకుంటున్న విద్యుత్ దీపాలు.. బిహెచ్ఇల్ లోని ఓ రోడ్డులో కనిపించిన దృశ్యం.

సెల్ఫీ ప్లీజ్...నానాక్రాం గూడలో తేరి యూనివర్శిటిలో కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రలు కేటిఆర్, లక్ష్మారెడ్డిలతో సెల్ఫీ తీసుకుంటున్న ఓ మహిళ

సప్తవర్ణాల సేతువు..భారీ భవంతుల మధ్య సేతువుగా అల్లుకున్న ఇంద్రధనస్సు. సుందర నగరం విశాఖపట్నంలో కనువిందు చేసిన దృశ్యమిది.

దావానలం.. కలకలంవిశాఖపట్నంలో భారీ ఎత్తున వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

విశేషాలంకారం.. వైజాగ్ లోని సాయిబాబా ఆలయంలో కనిపించిన కమనీయ దృశ్యం.

కెరటాలతో కేరింతసూర్యాస్త సమయంలో విశాఖపట్నం బీచ్ లో జనం సందడి. సాగర కెరటాలతో పోటీ పడుతూ కేరింతలు కొడుతున్న యువకులు.