దినేశ్ కుమార్, దివిజ జంటగా నటిస్తోన్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.
ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.


