ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతోన్న ‘పెద్దగట్టు జాతర’ చిత్రం మంగళవారం ప్రారంభమైంది.
విరాన్ష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ సి.హెచ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎ. రామ కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి టైటిల్‌ను రివీల్ చేశారు.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్ అందించగా, దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచాన్ చేశారు.


