
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ పెళ్లికి రెడీ అవుతోంది.

ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేయనుంది.

ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు.

దీంతో అవికా సంతోషంలో మునిగిపోయింది.

అవికా.. ఉయ్యాల జంపాల, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. వంటి పలు చిత్రాల్లో నటించింది.









