
గంగమ్మతల్లి పూజా మహోత్సవం జాలరిపేటలో గురువారం కనుల పండువగా జరిగింది. 2004 డిసెంబర్ 26న సునామీ సృష్టించిన బీభత్సం అనంతరం ఏటా అదే రోజున పెదజాలరిపేట మత్స్యకారులు గంగమ్మతల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది

ఈ సందర్భంగా తమ కుటుంబాలను చల్లగా చూడాలని, విపత్తుల నుంచి రక్షించాలని గంగమ్మతల్లిని వేడుకున్నారు

తీరంలో పూజల అనంతరం పూజా సామగ్రిని సముద్రంలో విడిచిపెట్టారు

మత్స్యకార మహిళలు నిర్వహించిన కలశాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది

తీరంలో మహిళలు వరుసక్రమంలో నిలిచి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు. సముద్రానికి హారతి ఇచ్చి, పసుపునీటిని, పాలను సముద్రంలో కలిపి, ఆ నీటిని శిరస్సుపై చల్లుకున్నారు













