హైదరాబాద్‌కు సమీపంలోని శంషాబాద్ మండలంలో వున్న పురాతన దేవాలయాన్ని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంగా పిలుస్తారు
ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ
ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు
శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం సుమారు 400 ఏళ్ల కిందటిదని చరిత్ర చెబుతోంది
అమ్మపల్లిలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు


