
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో నాలుగోరోజు కూడా భక్తుల కోలాహలం నెలకొంది.

బుధవారం సంప్రదాయం ప్రకారం నెలవారం కార్యక్రమాన్ని యా దవ పెద్దలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సూర్యాపేట యాదవ బజార్ నుంచి గట్టుకు తెచ్చిన మకర తోరణం గురువారం స్వస్థలానికి చేరనుంది. మకర తోరణం తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు.

















