
సాగరతీరం శివ పంచాక్షరి మంత్రంతో మార్మోగింది. డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించిన 40వ మహా కుంభాభిషేకం నేత్రపర్వంగా సాగింది.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నగరవాసులు హాజరై.. తమ స్వహస్తాలతో శివయ్యకు అభిషేకాలుచేశారు

మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్సార్) ప్రయాగరాజ్ నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో శివలింగాలకు అభిషేకాలు జరిపించారు

ఈ కార్యక్రమంలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో భక్తులే స్వయంగా అభిషేకాలు చేశారు






