షాడ బోనాల పండుగతో జంటనగరాలు గత కొన్ని రోజుల నుంచి కోలాహలంగా మారాయి
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సచివాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా నల్ల పోచమ్మ అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి బోనం సమర్పించారు
డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు


