నిహారికకు అమెరికా ఫెలోషిప్‌ | American Fellowship for niharika | Sakshi
Sakshi News home page

నిహారికకు అమెరికా ఫెలోషిప్‌

Jan 1 2018 2:54 AM | Updated on Apr 4 2019 3:25 PM

American Fellowship for niharika - Sakshi

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ రూరల్‌ గీసుకొండ మండలం గొర్రెకుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తౌటం నిహారిక అమెరికా ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. అమెరికా ప్రభుత్వం 2011 నుంచి పుల్‌ బ్రైట్స్‌ కమిషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ అందజేస్తోంది.

దేశవ్యాప్తంగా నలుగురు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి నిహారిక ఉన్నారు. ఫెలోషిప్‌ కింద జనవరి 3 నుంచి మే 14 వరకు నిహారికకు అమెరికాలో శిక్షణ ఇస్తారు. ఫెలోషిప్‌కు ఎంపికైన మిగిలిన వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాలని ఆమె కోరారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement