రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు | attack on ysrcp activists | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

Jan 5 2018 1:53 PM | Updated on Aug 10 2018 8:34 PM

attack on ysrcp activists - Sakshi

విజయనగరం జిల్లా: డెంకాడ మండలం మోదవలసలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మోదవలస గ్రామంలో జన్మభూమి సభ కోసం అర్జీలు రాస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై  దాడి చేశారు. ఈ క్రమంలో సురేష్, కాంతం అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా వీరికి సహాయంగా ఆటోలో వస్తున్న వారిపై మార్గమధ్యలో మరో సారి టీడీపీ వర్గీయులు దాడికి దిగారు.

దీంతో మరికొందరు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి రక్షణగా ఉండి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు గ్రామంలో సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement