మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ | TeGWA urges indian ambassador to repatrition of gulf workers bodies | Sakshi
Sakshi News home page

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ

Aug 7 2017 10:27 PM | Updated on Apr 7 2019 4:37 PM

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ - Sakshi

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణకు చెందిన పలమాకుల సత్తయ్య, గంగ శ్రీనందన్‌(19)ల మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు టీఈజీడబ్ల్యూఏ ఒమన్‌లోని భారత అంబాసిడర్‌కు ఓ లేఖ రాసింది.

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణకు చెందిన పలమాకుల సత్తయ్య, గంగ శ్రీనందన్‌(19)ల మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌(టీఈజీడబ్ల్యూఏ) ఒమన్‌లోని భారత అంబాసిడర్‌కు ఓ లేఖ రాసింది. ఈ మేరకు టీఈజీడబ్ల్యూఏ అధ్యక్షుడు నాంగి దేవేందర్‌ రెడ్డి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

సత్తయ్య 14 సంవత్సరాల క్రితం ఒమన్‌లో పని చేయడానికి వచ్చినట్లు చెప్పారు. కాగా, శ్రీనందన్‌ బహ్రయిన్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత నెల అనారోగ్యంతో ఒమన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సత్తయ్య.. 31వ తేదీన ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మనస్తాపంతో శ్రీనందర్‌ ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. సత్తయ్య, శ్రీనందన్‌ల మరణవార్తను వారి కుటుంబసభ్యులకు చేరవేసి, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement