భారత రత్న సచిన్ కు కాకుండా.. లాలూకి ఇవ్వాలా? | Shiva Sena flays Shivanand Tiwari for questioning Bharat Ratna to Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

భారత రత్న సచిన్ కు కాకుండా.. లాలూకి ఇవ్వాలా?

Nov 18 2013 8:36 PM | Updated on Sep 2 2017 12:44 AM

భారత రత్న సచిన్ కు కాకుండా.. లాలూకి ఇవ్వాలా?

భారత రత్న సచిన్ కు కాకుండా.. లాలూకి ఇవ్వాలా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు దేశ అత్యున్నత అవార్డు భారత రత్న ఇవ్వడాన్ని ప్రశ్నించిన జేడీ(యూ) సీనియర్ నేత శివానంద్ తివారీపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు దేశ అత్యున్నత అవార్డు భారత రత్న ఇవ్వడాన్ని ప్రశ్నించిన జేడీ(యూ) సీనియర్ నేత శివానంద్ తివారీపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సచిన్ భారత రత్న అనడంలో సందేహం అక్కర్లేదని శివసేన తెలిపింది. సచిన్ కాకుండా లాలూ ప్రసాద్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలా అని శివసేన నేత సంజయ్ రావత్ నిలదీశారు. సచిన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి తివారీ హక్కులేదు అని రావత్ అన్నారు. దేశ అస్థిత్వంలో సచిన్ ఓ భాగం అని అన్నారు. 
 
అంతేకాకుండా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయికి భారత రత్న అవార్డును ప్రకటించాలి అని రావత్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీకి అవార్డును ప్రకటించినపుడు వాజ్ పేయికి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నించారు. వాజ్ పేయికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారు సచిన్ కు భారత రత్న ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు అన్నారు. 
 
క్రికెట్ ఆడటం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన సచిన్ కు భారత రత్న ఇవ్వడం ఓ జోక్ అని.. దేశం తరపున సచిన్ ఉచితంగా క్రికెట్ ఆడలేదు అని తివారీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement