ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా | Sheila Dikshit resigns as Delhi CM | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా

Dec 8 2013 12:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా - Sakshi

ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా

ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు.

ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. గత 15 సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా సేవలందించిన సంగతి తెలిసిందే.
 
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రివాల్ కంటే 5500 వేల ఓట్ల తేడాతో షీలా వెనుకంజలో ఉంది. షీలా దీక్షిత్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి అందచేశారు.
 
ప్రస్తుత ఫలితాలను బట్టి 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పది స్థానాల్లో కూడా గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. 
 

Advertisement
 
Advertisement
Advertisement