ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి 48 గంటలు కూడా గడవక ముందే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
చంద్రబాబు చేసింది నదుల అనుసంధానం కాదని, దీని పేరుతో నిధుల అనుసంధానం చేశారని, గోదావరి నీటిని వృథాగా సముద్రం పాలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు. ఉద్యోగుల్ని బలిపశువులను చేసే ప్రయత్నం చేస్తున్నారని, పట్టిసీమను పక్కనబెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని పేర్నినాని అన్నారు.