దుస్తులు ఆరేసే తీగతో షాక్: మహిళ మృతి | woman to kill current shock | Sakshi
Sakshi News home page

దుస్తులు ఆరేసే తీగతో షాక్: మహిళ మృతి

Aug 7 2015 12:31 AM | Updated on Sep 3 2017 6:55 AM

ఉతికిన దుస్తులను ఆర వేసేందుకు వాడే ఇనుప తీగ ప్రాణం తీసింది.

కట్టంగూర్(నల్లగొండ): ఉతికిన దుస్తులను ఆర వేసేందుకు వాడే ఇనుప తీగ ప్రాణం తీసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన గుండాల పద్మ(35) గురువారం సాయంత్రం తన ఇంట్లో ఆరుబయట దండెం తీగపై ఉన్న బట్టలను తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పద్మను రక్షించే ప్రయత్నంలో భర్త నర్సింహ, కూతురు భాగ్యలక్ష్మి గాయాలపాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement