వన్సైడ్ లవర్ ఘాతుకం | Woman shot dead by jilted lover | Sakshi
Sakshi News home page

వన్సైడ్ లవర్ ఘాతుకం

Jul 13 2015 3:23 PM | Updated on Sep 3 2017 5:26 AM

వన్సైడ్ లవర్ ఘాతుకం

వన్సైడ్ లవర్ ఘాతుకం

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఒప్పుకోకుంటే దేనికైనా వెనకాడనన్నాడు. ఆమె కూడా అంతే మొండిగా చెప్పేసింది..

బిజ్నూర్: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఒప్పుకోకుంటే దేనికైనా వెనకాడనన్నాడు. ఆమె కూడా అంతే మొండిగా చెప్పేసింది.. 'నువ్వంటే నాకు ఇష్టం లేదు' అని. దీంతో ఆ వన్సైడ్ లవర్ ఆమెను నిర్దాక్షణ్యంగా కాల్చిచంపాడు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ పోలీసులు సోమవారం వెల్లడించారు.

స్థానిక యువకుడు ప్రదీప్ (23) చిన్నాచితకా పనులు చేసుకునేవాడు. వాళ్ల ఇంటికి సమీపంలోన ఉండే సుమితిని కొద్ది కాలంగా ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు ఆమెకు ఈ విషయం చెప్పాడు. అయితే 'నీతో ప్రేమ ఏమాత్రం ఇష్టం లేదని, నన్నిలా వదిలెయ్యి' అని సుమితి.. ప్రదీప్కు స్పష్టం చేసింది. దీంతో ఆమెపై కక్షపెంచుకున్న అతడు ఆదివారం రాత్రి ఆమెను హత్యచేశాడు. అతి సమీపం నుంచి తుపాకితో కాల్పులు జరపడంతో సుమితి అక్కడికక్కడే మృతిచెందిందని, హత్య అనంతరం ప్రదీప్ పరారయ్యాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితుడికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement