విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం! | Will give Rahul Gandhi great gift | Sakshi
Sakshi News home page

విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం!

Feb 4 2017 12:34 PM | Updated on Aug 14 2018 9:04 PM

విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం! - Sakshi

విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్‌లో ఓటువేసేందుకు భార్య నవజ్యోత్‌ కౌర్‌తో కలిసి వచ్చిన క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పంజాబ్‌లో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పంజాబ్‌ ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ విజయాన్ని రాహుల్‌గాంధీకి కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ధర్మయుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో తామే విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడుతుందని, ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ విజయపరంపర మొదలవుతుందని ఆయన విలేకరులతో అన్నారు. కాగా, పంజాబ్‌లో కాస్తా మందకొడిగా పోలింగ్‌ సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం 11.30 గంటల వరకు 14శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement